30 పోలీస్‌ యాక్ట్‌ అమలు : ఎస్పీ | - | Sakshi
Sakshi News home page

30 పోలీస్‌ యాక్ట్‌ అమలు : ఎస్పీ

Nov 2 2026 12:47 AM | Updated on Nov 2 2026 12:47 AM

నారాయణపేట: జిల్లాలో శాంతిభద్రతల పరిరక్షణ, ప్రజల భద్రతే లక్ష్యంగా జిల్లావ్యాప్తంగా 30 పోలీస్‌ యాక్ట్‌ అమలులోకి తీసుకొచ్చినట్లు ఎస్పీ డా. వినీత్‌ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. పోలీసుశాఖ ముందస్తు అనుమతి లేకుండా ర్యాలీలు, ఊరేగింపులు, సమావేశాలు, ధర్నాలు, బహిరంగ సభలు నిర్వహించరాదని పేర్కొన్నారు. ప్రజాజీవనం, రాకపోకలు, శాంతిభద్రతలకు విఘాతం కలిగించే విధంగా జన సమూహాలను ఏర్పాటు చేయడం నిషేధమని పేర్కొన్నారు. ఎలాంటి అనుమతి లేకుండా కార్యక్రమాలు నిర్వహించే నిర్వాహకులపై చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అలాగే సామాజిక మాధ్యమాల్లో మతాల మధ్య విధ్వేషాలు రెచ్చగొట్టేలా, ప్రజల మధ్య విభేదాలు సృష్టించేలా తప్పుడు వార్తలు, అభ్యంతరకర పోస్టులు ప్రచారం చేస్తే ఉపేక్షించేది లేదని.. అలాంటి వారిపై కేసులు నమోదు చేసి చట్టపరమైన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. జిల్లాలో ఏదైనా కార్యక్రమం నిర్వహించాలనుకునేవారు ముందుగా పోలీసుశాఖకు దరఖాస్తు చేసుకొని అనుమతి పొందాలని సూచించారు. పోలీసు నిబంధనలను ప్రతి ఒక్కరూ పాటిస్తూ ప్రశాంత వాతావరణం కొనసాగేందుకు సహకరించాలని కోరారు.

తాగునీటి సరఫరాకు బ్రేక్‌

నారాయణపేట: కోస్గి మండలంలో రహదారి విస్తరణ పనుల నేపథ్యంలో కడంపల్లి సంప్‌ నుంచి కోస్గి ఓహెచ్‌బీఆర్‌ వరకు ఉన్న మిషన్‌ భగీరథ పైపులైన్‌న్‌ను మార్చాల్సి వస్తోందని.. మరమ్మతుల కారణంగా మండలంలోని 31 గ్రామాలకు రెండ్రోజుల పాటు తాగునీటి సరఫ రా నిలిపివేయనున్నట్లు మిషన్‌ భగీరథ గ్రిడ్‌ డివిజన్‌ కార్యనిర్వాహక ఇంజినీర్‌ శ్రీనివాస్‌ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. సోమవా రం ఉదయం 8 నుంచి 4వ తేదీ ఉదయం 8 వరకు కోస్గి మండలంలోని 23 గ్రామాలు, కోస్గి పుర పరిధిలోని 8 గ్రామాలకు నీటి సరఫరా ఉండదని.. ప్రజలు ఇబ్బందులు పడకుండా ముందస్తుగా తాగునీటిని నిల్వ చేసుకోవాలని, పనులు పూర్తయ్యే వరకు అధికారులకు సహకరించాలని ఆయన పేర్కొన్నారు.

న్యాయశాఖ ఉద్యోగుల సంఘం జిల్లా కార్యవర్గం

నారాయణపేట: న్యాయశాఖ ఉద్యోగుల సంఘం జిల్లా కార్యవర్గాన్ని ఆదివారం జిల్లా కోర్టు ఆవరణలో ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. అధ్యక్షుడిగా ధనుంజయ, ప్రధాన కార్యదర్శిగా రమే ష్‌, అసోసియేట్‌ అధ్యక్షుడిగా బి.అంజమ్మ, ఉపాధ్యక్షుడిగా ఎం.శివయ్య, కార్యనిర్వాహక కార్యదర్శిగా మూలింటి మధుసూదన్‌, కోశాధికారిగా మధుకుమార్‌, సంయుక్త కార్యదర్శిగా పుష్పావతి ఎన్నికయ్యారు.రాష్ట్ర కార్యవర్గప్రతి నిధులు శ్రవణ్‌కుమార్‌, కేశవులు సమక్షంలో ఎన్నికల ప్రక్రియ ప్రజాస్వామ్యబద్ధంగా కొనసాగింది. నూతనంగా ఎన్నికై న కార్యవర్గసభ్యులకు పలువురు ఉద్యోగులు అభినందనలు తెలిపారు. తమపై నమ్మకంతో బాధ్యతలు అప్పగించిన ఉద్యోగులందరికీ కార్యవర్గ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement