నారాయణపేట: ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (ఎస్‌ఐఆర్)పై ప్రతిపక్షాలు ప్రజలకు అనవసర అనుమానాలు, అపోహలు సృష్టిస్తూ తప్పు డు ప్రచారం చేస్తున్నాయని.. మేధావులు వాస్తవా లను వివరించి తిప్పికొట్టాలని మహబూబ్‌నగర్ ఎంపీ డీకే అరుణ కోరారు. ఆదివారం జిల్లాకేంద్రంలో ఎస్‌ఐఆర్‌పై నిర్వహించిన మేధావుల సదస్సుకు ఆమె ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. సర్ ప్రక్రియ దేశంలో తొలిసారి జరుగుతున్నదేమీ కాదని.. 1952 నుంచి ఇప్పటి వరకు 8 సార్లు ఓటరు జాబితాల సవరణ జరిగిందన్నారు. ఇందులో అత్యధికంగా కాంగ్రెస్ పాలనలోనే సవరణలు చేపట్టార ని గుర్తుచేశారు. కేరళలో ఎస్‌ఐఆర్‌తోనే అధికారంలోకి వచ్చామని కేరళ హోంమంత్రి రమేష్ చెన్నితల వ్యాఖ్యానించారని తెలిపారు. గతంలో ఎన్నికల సంఘం కమిషనర్లకు రాజకీయ పదవులు ఇచ్చిన ఘనత కాంగ్రెస్‌పార్టీకే దక్కుతుందని విమర్శించారు. ఎన్నికల్లో ఓటమి చెందిన ప్రతిసారి ఈవీఎంలను తప్పుబడుతోందని.. కర్ణాటకలో పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలు బ్యాలెట్ విధానంలో జరిగినప్పటికీ కాంగ్రెస్‌పార్టీ ఒక్కస్థానాన్ని కూడా కై వసం చేసుకోలేదన్నారు. రాజకీయ ప్రయోజనాల కోసం ప్ర జాస్వామ్య వ్యవస్థలను తప్పుబట్టడం సరైంది కాదని.. ఓటరు జాబితాల్లోని డుప్లికేట్, డబుల్ ఓట్లతో పాటు మరణించిన వారి పేర్లను తొలగించకూడదా? అని ప్రశ్నించారు. అన్నిరంగాల్లో దేశం అభివృద్ధి చెందుతుండటం, ప్రధాని మోదీకి ప్రజల్లో పెరుగుతున్న ఆదరణను కాంగ్రెస్ జీర్ణించుకోలేకపోతోందని విమర్శించారు. 2047 నాటికి వికసిత్ భారత్ లక్ష్యాన్ని సాధించేందుకు ప్రధాని కృషి చేస్తున్నారని, దేశాన్ని విచ్ఛిన్నం చేసి అధికారంలోకి రావాలని కాంగ్రెస్ కలలు కంటోందని వ్యాఖ్యానించారు. కార్యక్రమంలో బీజేపీ సీనియర్ నాయకులు నాగురావునామాజీ, రతంగ్ పాండురెడ్డి, పగడాకుల శ్రీనివాస్, పార్టీ జిల్లా అధ్యక్షుడు సత్యయాదవ్, ఆర్‌ఎస్‌ఎస్ పెద్దలు ఎల్లప్ప, ఓబీసీమోర్చా రాష్ట్ర ఉపాధ్యక్షుడు రఘురామయ్య, మున్సిపల్ చైర్మన్ శ్వేత, వైస్ చైర్మన్ మంజుల, పట్టణ అధ్యక్షుడు పోషల్ వినోద్ తదితరులు పాల్గొన్నారు.
మహబూబ్‌నగర్ ఎంపీ డీకే అరుణ


