మరికల్: నేరాల నియంత్రణలో ప్రజల భాగస్వామ్యమే ధ్యేయంగా కమ్యూనిటీ కనెక్ట్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు డీఎస్పీ నల్లపు లింగయ్య తెలిపా రు. ఎస్పీ ఆదేశాల మేరకు ఆదివారం ఉదయం పట్టణంలోని ఎస్సీకాలనీలో నిర్బంధ తనిఖీలు చేపట్టారు. 44 మంది పోలీసులు 125 ఇళ్లను తనిఖీ చేసి సరైన ధ్రువపత్రాలు లేని 71 ద్విచక్ర వాహనాలు, 2 ఆటోలను స్వాధీనం చేసుకున్నారు. ఈ సందర్భంగా డీఎస్పీ మాట్లాడుతూ.. నేరరహిత సమాజ నిర్మాణానికిగాను సమస్యాత్మక ప్రాంతాలపై ప్రత్యేక దృష్టి సారించినట్లు తెలిపారు. చోరీల నియంత్రణకు ఇళ్లు, దుకాణాల వద్ద సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో సీఐ భగవంత్‌రెడ్డి, ఎస్‌ఐలు రాంలాల్‌నాయక్, రమేష్, కృష్ణంరాజు, రేవతి, మహేందర్‌రెడ్డి, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.
మద్దూరు పురపాలికలో..
కొత్తపల్లి: ఎస్పీ వినీత్ ఆదేశాల మేరకు కోస్గి సీఐ సైదులు ఆధ్వర్యంలో ఆదివారం తెల్లవారుజామున మద్దూరులోని అమరగడ్డకాలనీలో కార్డెన్ సెర్చ్ నిర్వహించారు. ఉదయం 5.30 నుంచి 8.30 వరకు 65 మంది పోలీసులు 144 ఇళ్లను తనిఖీ చేశారు. సరైన పత్రాలు లేని 79 వాహనాలను సీజ్ చేయగా అందులో 74 ద్విచక్ర, 4 త్రిచక్ర, ఒక నాలుగు చక్రాల వాహనం ఉన్నాయి. అలాగే 15.66 లీటర్ల మద్యం స్వాధీనం చేసుకొని డ్రంకెన్ డ్రైవ్ కేసు నమోదు చేశారు. ఈ సందర్భంగా సీఐ సైదులు మాట్లాడుతూ.. నేరాల నియంత్రణకు ప్రతి గ్రామంలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని.. ఒక్క సీసీ కెమెరా 100 మంది పోలీసులతో సమానమని తెలిపారు. యువత మాదక ద్రవ్యాలకు దూరంగా, సైబర్ నేరగాళ్లతో అప్రమత్తంగా ఉండాలని సూచించారు. మద్దూరు, దామరగిద్ద, కోస్గి ఎస్‌ఐలు విజయ్‌కుమార్, నరేష్, నాగరాజు పాల్గొన్నారు.


