నారాయణపేట ఎడ్యుకేషన్: విదేశీ వస్తువులు వదిలి స్వదేశీ వస్తువులను వినియోగించాలని విభాక్ ప్రచారక్ దేవేందర్ జీ అన్నారు. ఆదివారం జిల్లాకేంద్రంలో రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ శతాబ్ధి ఉత్సవాల ముగింపు సందర్భంగా పథ సంచలన్ ఘనంగా నిర్వహించారు. పథ సంచలన్‌లో నారాయణపేట, దామరగిద్ద, ఉట్కూర్ ఖండల నుంచి స్వయం సేవకులు పాల్గొన్నారు. జిల్లాకేంద్రంలోని పరిమళాపురం నుంచి నారాయణపేట విభాగం, శీలా గార్డెన్స్ నుంచి ఉట్కూర్ విభాగం, బారంబావి నుంచి దామరగిద్ద విభాగం తమ కవాతును ప్రారంభించి పుర వీధుల్లో నిర్వహించారు. మహిళలు అడగడుగునా ఆర్‌ఎస్‌ఎస్ కార్యకర్తలకు పూలతో స్వాగతం పలికారు. చివరకు మినీ స్టేడియంలో నిర్వహించిన సభతో ఆయన మాట్లాడుతూ.. హిందువుల సంఘంటితం కోసం ఆర్‌ఎస్‌ఎస్‌ను ప్రారంభించారని, వర్ణం, కులం పేరుతో విడిపోయినా భారతదేశాన్ని సంఘటితం చేయడానికి కృషి చేస్తోందన్నారు. మన సంస్కృతి, సంప్రదాయాలను తరతరాలకు అందించాలని, విదేశీ కుట్రలను దేశం సమర్ధవంతంగా ఎదుర్కొంటుదని తెలిపారు. దేశంలోని 2.50 లక్షల గ్రామాల్లో ఆర్‌ఎస్‌ఎస్ శాఖలు ఉన్నాయని.. సంఘ విద్రోహ శక్తుల పట్ల వ్యతిరేకంగా పోరాడాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. కార్యక్రమంలో నారాయణపేట సంఘ చాలక్ డా. మదన్‌మోహన్‌రెడ్డి, ఉట్కూర్ సంఘచాలక్ నీలి రాంరెడ్డితో పాటు స్వయం సేవకులు పాల్గొన్నారు.


