నారాయణపేట ఎడ్యుకేషన్: జిల్లాకేంద్రంలో ఆదివారం నిర్వహించిన ఎన్ఎంఎంఎస్ అర్హత పరీక్ష ప్రశాంతంగా ముగిసినట్లు జిల్లా విద్యాధికారి డా. గోవిందరాజు తెలిపారు. జిల్లావ్యాప్తంగా మొత్తం 859 మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకోగా.. 820 మంది హాజరుకాగా, 39 మంది విద్యార్థులు గైర్హాజరయ్యారని 95 శాతం హాజరు నమోదైనట్లు వెల్లడించారు. ఎర్రగుట్ట సమీపంలోని గురుకుల బాలికల పాఠశాల సెంటర్–ఏలో 220 మందికిగాను 210 మంది.. సెంటర్–బిలో 219 మందికిగాను 211 మంది.. ప్రభుత్వ బాలికల పాఠశాల పరీక్ష కేంద్రంలో 209 మందికిగాను 200 మంది.. ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో 211 మందికిగాను 199 మంది విద్యార్థులు హాజరయ్యారని వివరించారు.


