మక్తల్‌ అభివృద్ధికి మంత్రి కలిసి రావడం లేదు | - | Sakshi
Sakshi News home page

మక్తల్‌ అభివృద్ధికి మంత్రి కలిసి రావడం లేదు

Oct 27 2026 12:38 AM | Updated on Oct 27 2026 12:38 AM

● సమష్టిగా పనిచేస్తేనే ప్రగతి సాధ్యం

● మహబూబ్‌నగర్‌

ఎంపీ డీకే అరుణ

మక్తల్‌/మాగనూర్‌(కృష్ణా): ‘‘మక్తల్‌ అభివృద్ధికి కేంద్రం నిధులు కావాలని రాష్ట్ర మంత్రి వాకిటి శ్రీహరి ఎవరిని సంప్రదించడం లేదు.. కృష్ణాలో ప్రాథమిక ఆరోగ్యకేంద్రం ప్రారంభోత్సవానికి మంత్రి వస్తారని అనుకున్నా.. కాని రాలేదు.. ప్రజాప్రతినిధులు కలిసి పనిచేస్తేనే అభివృద్ధి సాధ్యమవుతుంది.’’ అని మహబూబ్‌నగర్‌ ఎంపీ డీకే అరుణ అన్నారు. సోమవారం మక్తల్‌ మండలం ఉప్పరిపల్లిలో గ్రామ పంచాయతీ భవనంతో పాటు కృష్ణాలో రూ. 1.56కోట్లతో నిర్మించిన పీహెచ్‌సీని ఆమె ప్రారంభించి మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వం విద్య, వైద్యానికి అధిక ప్రాధాన్యం ఇస్తోందన్నారు. రాష్ట్రంలో చేపట్టే ప్రతి అభివృద్ధి పనిలో కేంద్రం నిధులు ఉంటాయన్నారు. అయితే కాంగ్రెస్‌ ప్రభుత్వం కేంద్రం నిధులతో అభివృద్ధి పనులు చేపడుతున్నట్లు ఎక్కడా చెప్పకపోవడం సరైంది కాదన్నారు. కృష్ణా మండల ప్రజలు ఎక్కువగా వైద్యసేవల కోసం కర్ణాటకకు వెళ్తుంటారని.. వారి ఇబ్బందులను తీర్చేందుకు స్థానికంగానే అధునాతన హంగులతో పీహెచ్‌సీ నిర్మించినట్లు చెప్పారు. ఆరోగ్యకేంద్రంలో వెంటనే సేవలను ప్రారంభించేలా అధికారులు సత్వర చర్యలు తీసుకోవాలని ఎంపీ సూచించారు. డబుల్‌ ఇంజిన్‌ సర్కార్‌తోనే అభివృద్ధి సాధ్యమన్నారు. కేంద్ర సహకారం లేకపోతే.. రాష్ట్ర ప్రభుత్వం అడుగు ముందుకువేసే పరిస్థితి లేదన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సమన్వయంతో పనిచేస్తే అభివృద్ధి రెండు రెట్లు ముందుకెళ్తుందన్నారు. మక్తల్‌ అభివృద్ధి కోసం కలిసి పనిచేసేందుకు తాము సిద్ధంగా ఉన్నా.. మంత్రి కలిసి రావడం లేదన్నారు. అనంతరం కృష్ణా మండలం మురహర్‌దొడ్డిలో మహిళా సమాఖ్య భవనాన్ని ఎంపీ ప్రారంభించారు. అలాగే మక్తల్‌ పట్టణంలోని నల్లజానమ్మ, పడమటి ఆంజనేయస్వామి ఆలయాలను ఎంపీ సందర్శించి ప్రత్యేక పూజలు చేశారు. కార్యక్రమాల్లో డీఎంహెచ్‌ఓ జయచంద్రమోహన్‌, డిప్యూటీ డీఎంహెచ్‌ఓ సిద్ధప్ప, ఎన్‌సీడీ ప్రోగ్రాం అధికారి డా.కట్టా లక్ష్మీకాంత్‌, వైద్యులు సత్యప్రకాశ్‌రెడ్డి, కిష్టమ్మ, డీపీఓ బిక్షపాటిల్‌, మెడికల్‌ ఆఫీసర్‌ జాంరాజ్‌, అఫ్రోజ్‌, సర్పంచ్‌ రవితేజ, బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు లక్ష్మీకాంత్‌రెడ్డి, పడుకుల శ్రీనివాసులు, సత్యయాదవ్‌, బలరాంరెడ్డి, తిరుపతిరెడ్డి, శ్యాంసుందర్‌, నల్లె నర్సప్ప, జయానంద్‌రెడ్డి కర్నిస్వామి, బాల్‌రాంరెడ్డి, ప్రతాప్‌రెడ్డి, రాజశేఖర్‌రెడ్డి, కౌన్సిలర్‌ కృష్ణ, నర్సింహారెడ్డి, సత్యనారాయణ, అశోక్‌ పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement