కోస్గి రూరల్: రాష్ట్ర ప్రభుత్వం శిశు సంక్షేమంపై ప్రత్యేక శ్రద్ధ వహిస్తోందని కొడంగల్ డెవలప్‌మెంట్ అథారిటీ ప్రత్యేకాధికారి వెంకట్‌రెడ్డి, కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్‌చార్జి తిరుపతిరెడ్డి అన్నారు. కోస్గి పట్టణంలోని 7, 10, 13 వార్డుల్లో కడా నిధులు రూ. 60లక్షలతో నిర్మించిన అంగన్‌వాడీ కేంద్రాలను సోమవారం వారు ప్రారంభించి మాట్లాడారు. మున్సిపాలిటీని అన్ని రంగాల్లో తీర్చిదిద్దేందుకు కృషి చేస్తున్నట్లు చెప్పారు. అంగన్‌వాడీ కేంద్రాల ద్వారా ప్రభుత్వం అందిస్తున్న పౌష్టికాహారాన్ని లబ్ధిదారులకు సక్రమంగా పంపిణీ చేయాలని సిబ్బందికి సూచించారు. కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ వార్ల విజయ్‌కుమార్, మున్సిపల్ చైర్మన్ నాగులపల్లి నరేందర్, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు రఘువర్ధన్‌రెడ్డి, మున్సిపల్ అధ్యక్షుడు బెజ్జు రాములు, కౌన్సిలర్లు తుడుం శ్రీనివాస్, కోడిగంటి హరికుమార్, ఆంజనేయులు, రాస్నం బాల్‌రాజ్, పీఏసీఎస్ చైర్మన్ భీంరెడ్డి, వైస్ చైర్మన్ వేణుగోపాల్, బాలేష్, వెంకటేశ్, బాలకిష్టయ్య, ఇద్రిస్ పాల్గొన్నారు.
నేడు డయల్
యువర్ డీఎం
నారాయణపేట: ఆర్టీసీ ప్రయాణికుల సమస్యలను తెలుసుకునేందుకు గాను మంగళవారం డయల్ యువర్ డీఎం కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు నారాయణపేట ఆర్టీసీ డిపో మేనేజర్ యాకన్న సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లా కేంద్రంతో పాటు పరిసర ప్రాంతాల ప్రయాణికులు ఉదయం 11 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు 73828 26293 నంబర్‌ను సంప్రదించి, ఆర్టీసీ సేవలకు సంబంధించిన సమస్యలు, సూచనలను తెలియజేయవచ్చని పేర్కొన్నారు. ప్రయాణికులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని తమ సమస్యలను తన దృష్టికి తీసుకురావాలని డీఎం కోరారు.
వరిధాన్యం క్వింటా రూ.3,789
నారాయణపేట: జిల్లా కేంద్రంలోని వ్యవసాయ మార్కెట్‌యార్డులో సోమవారం సోన వడ్లు క్వింటాకు గరిష్టంగా రూ. 3,789, కనిష్టంగా రూ. 2,669 ధర పలికింది. హంస ధాన్యం క్వింటాకు రూ. 2,561 ధర వచ్చింది.


