నారాయణపేట: హిందూ ధర్మ సంప్రదాయంలో ఆయుధ పూజకు విశిష్టమైన స్థానం ఉందని విశ్వహిందూ పరిషత్ రాష్ట్ర ధర్మాచార్య సంపర్క ప్రముఖ్ పగుడాకుల బాలస్వామి అన్నారు. విజయదశమి పర్వదినాన్ని పురస్కరించుకొని సోమవా రం నారాయణపేట బజరంగ్‌దళ్ ఆధ్వర్యంలో స్థానిక భవానీమాత మందిరంలో ఆయు ధ పూజ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఆయుధ పూజ అనేది ధర్మా న్ని పరిరక్షించడానికి, సమాజాన్ని రక్షించడానికి, అన్యా యాన్ని ఎదుర్కొనే ధైర్యాన్ని పెంపొందించుకోవడానికి ప్రతీక అని వివరించారు. దుర్గామాత మహిషాసురుడిని సంహరించి ధర్మాన్ని స్థాపించిన పురాణగాథ, శ్రీరాముడు రావణుడిపై విజయం సాధించిన విజయదశమి సంప్రదాయం ధర్మానికి అంతిమంగా విజయం లభిస్తుందనే సందేశాన్ని అందిస్తున్నాయన్నారు. పురాతన కాలంలో రాజు లు, సైనికులు తమ ఆయుధాలకు పూజలు నిర్వహించి.. దేశ, ప్రజా రక్షణకు సంకల్పించేవారని గుర్తుచేశారు. నేటి కాలంలోనూ ఆయుధ పూజ అందరిలో ఆత్మవిశ్వాసం, కర్తవ్యనిష్ఠ, క్రమశిక్షణ, ధర్మ పరిరక్షణపై బాధ్యతను పెంపొందించాలని కాంక్షించారు. హిందూ సమాజం కులమతాలకు అతీతంగా ఐక్యంగా ఉండాలని.. పేద, ధనిక అనే తేడాలు లేకుండా పరస్పర గౌర వంతో జీవించాలని ఆయన పిలుపునిచ్చారు. సమాజంలో బలహీనులకు అండగా నిలవడం, మహిళలను గౌరవించడం, యువతలో దేశభక్తి, సేవాభావం పెంపొందించడం ప్రతి ఒక్కరి బాధ్య త అని పేర్కొన్నారు. విజయదశమి స్ఫూర్తితో ప్రతి హిందువు ధర్మాచరణకు కట్టుబడి, సమాజ ఐక్యతకు కృషి చేయాలని కోరారు. కార్యక్రమంలో విశ్వహిందూ పరిషత్ జిల్లా కార్యదర్శి శివకుమార్, నగర కార్యదర్శి ప్రవీణ్ కడదాస్ బజరంగ్‌దళ్ జిల్లా కన్వీనర్ శ్రవణ్ కుమార్, వార్డు కౌన్సిలర్ రాజేశ్ ఘాట్, గిరీష్ కర్లీ రాజశేఖర్ మేకల రామకృష్ణ, ఆకాష్ చక్రి, విజయ్, శివ, రవి, చరణ్, నరేష్, మోనేష్, అనిల్, శివాజీ, రవి పాల్గొన్నారు.


