కూరగాయలు, నూనెలు, పప్పుదినుసుల ధరలు విపరీతంగా పెరిగాయి. వారాంతపు సంతకు రూ.500 తీసుకెళ్తె నాలుగైదు రోజుల కూరగాయలు కూడా రావడం లేదు. నిత్యం కూరల్లో వాడే ఉల్లిని ప్రస్తుతం దూరం పెట్టాల్సి వస్తోంది. పండుగ వేళ నిత్యావసర సరుకులతో పాటు కూరగాయల ధరలు కూడా పెరగడంతో పండుగలు చేసుకోవాలంటేనే భయమేస్తోంది.
– వరలక్ష్మి, పల్లెగడ్డ
రూ.10 వేలు సరిపోవడం లేదు..
పెరిగిన నిత్యావసర సరుకుల ధరల కారణంగా గత ఆరు నెలలుగా వచ్చే నెల వేతనం రూ.10 వేలు సరిపోవడం లేదు. అంతకుముందు కుటుంబ అవసరాలుపోను రూ.3 వేలు మిగిలేవి. ఇప్పుడు పెరిగిన ధరలతో ఖర్చులు తడిసి మోపెడవుతున్నాయి. దసరా పండుగకు పిల్లలకు కొత్త దుస్తులు కొనడం కూడా భారమైంది. పండుగ చేసుకోవాలంటే అప్పులు చేయాల్సిన అవసరం వచ్చింది. – బాలకృష్ణ, మరికల్
●


