కొనసాగుతున్న ఎన్‌్‌హెచ్‌ఎం ఉద్యోగుల సమ్మె | - | Sakshi
Sakshi News home page

కొనసాగుతున్న ఎన్‌్‌హెచ్‌ఎం ఉద్యోగుల సమ్మె

Oct 16 2026 1:00 AM | Updated on Oct 16 2026 1:00 AM

నారాయణపేట: జిల్లాకేంద్రంలోని వివేకానంద పార్కు వద్ద జాతీయ ఆరోగ్య మిషన్‌ (ఎన్‌హెచ్‌ఎం) ఉద్యోగులు చేపట్టిన నిరవధిక సమ్మె జిల్లాలో గురువారం మూడోరోజుకు చేరింది. మహిళా ఉద్యోగులు ముగ్గులు వేసి వినూత్నంగా నిరసన తెలిపారు. ఈ సందర్భంగా పలువురు ఉద్యోగులు మాట్లాడుతూ.. చేశారు. ప్రజారోగ్య పరిరక్షణకు అహర్నిశలు శ్రమిస్తున్నప్పటికీ కాంట్రాక్టు, ఔట్‌సోర్సింగ్‌ విధానాల్లో అభద్రత మధ్య పనిచేయాల్సి వస్తోందని పేర్కొన్నారు. మహిళా ఉద్యోగులకు 180 రోజుల వేతనంతో కూడిన ప్రసూతి సెలవులు మంజూరు చేయాలని, ఏటా ఐదు శాతం వార్షిక ఇంక్రిమెంట్లు అమలు చేయాలని కోరారు. ఉద్యోగులతో పాటు వారి కుటుంబాలకు ఆరోగ్య భద్రత కల్పించాలని, తగిన రిటైర్మెంట్‌ ప్రయోజనాలు అందించాలని విజ్ఞప్తి చేశారు. పెరుగుతున్న నిత్యావసర వస్తువుల ధరలకు అనుగుణంగా వేతనాలు పెంచి కుటుంబాల భవిష్యత్‌కు భరోసా కల్పించాలని ప్రభుత్వాన్ని కోరారు. ఎన్‌హెచ్‌ఎం ఉద్యోగులకు బీజేపీ జిల్లా అధ్యక్షుడు సత్యయాదవ్‌ మద్దతు ప్రకటించారు. కార్యక్రమంలో యూనియన్‌ కోశాధికారి రాఘవేందర్‌, సభ్యులు డా. నర్సింహారావు సగరి, మోనేష్‌చారి, శ్రీలత, వెంకటరమణ, అనురాధ, తిరుపతి, కిరీటి, శ్వేతశ్రీ, విరోజ, చందన, పుష్ప, సరస్వతి, డీడీఎం స్నేహలత, డీఏఎం మమత తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement