‘జలసిరి’ లక్ష్యంపై దృష్టి సారించాలి | - | Sakshi
Sakshi News home page

‘జలసిరి’ లక్ష్యంపై దృష్టి సారించాలి

Oct 16 2026 1:00 AM | Updated on Oct 16 2026 1:00 AM

కోస్గి రూరల్‌: గ్రామీణ ప్రాంతాల్లో సాగునీటి ఆవశ్యకతను పెంపొందించేందుకు కేంద్రం తీసుకొచ్చిన జలసిరి లక్ష్యాన్ని గడువులోగా పూర్తి చేయాలని జె డ్పీ డిప్యూటీ సీఈఓ సుజాత ఆదేశించారు. గురువా రం కోస్గి ఎంపీడీఓ కార్యాలయ సమావేశ మందిరంలో పంచాయతీ కార్యదర్శులు, ఫీల్డ్‌ అసిస్టెంట్లు, మే టీలు, సాంకేతిక సహాయకులతో నిర్వహించిన ప్రత్యేక సమావేశానికి ఆమె హాజరై మాట్లాడారు. మండలానికి 59 ఫాంపాండ్ల ప్రతిపాదనలకుగాను 44 మంజూరు కాగా.. 15 పనులు కొనసాగుతున్నా యని వివరించారు. బోర్‌వెల్‌ రీచార్జ్‌ 9, ఇంకుడు గుంతలు 1,980గాను 980 మంజూరయ్యాయని మరో రెండ్రోజుల్లో పనులు చేపడతామన్నారు. పనుల్లో వేగం పెంచి గడువులోగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. అనంతరం మండలంలోని ముశ్రీఫాలో పాంపాండ్‌ పనులను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. సమావేశంలో ఎంపీడీఓ శ్రీధర్‌, ఏపీఓ జయప్రకాశ్‌రెడ్డి, పంచాయతీ కార్యదర్శులు, ఫీల్డ్‌ అసిస్టెంట్లు, రైతులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement