ఉమ్మడి జిల్లాలో 7.50 లక్షల ఎకరాల్లో ఎకరాకు పది క్వింటాళ్ల చొప్పున దిగుబడి వస్తే 75 లక్షల క్వింటాళ్ల పత్తి ఉత్పత్తి అయ్యేది. కానీ ప్రస్తుత పరిస్థితుల్లో వర్షాధార పంటల నుంచి ఆశించిన స్థాయిలో దిగుబడి రావడం లేదు. మొత్తం ఉత్పత్తి 36–45 లక్షల క్వింటాళ్లకు పరిమితమయ్యే అవకాశముందని అంచనా వేస్తున్నారు. దీంతో 29–37 లక్షల క్వింటాళ్ల మేర దిగుబడి తగ్గే ప్రమాదం ఉంది. ప్రస్తుత మార్కెట్ ధరల ప్రకారం ఈ లోటు రైతులకు రూ.2,500 కోట్ల నుంచి రూ.3,400 కోట్ల వరకు ఆర్థిక నష్టాన్ని మిగిల్చే అవకాశం ఉంది.


