తవ్వినకొద్దీ అక్రమాలే..! | - | Sakshi
Sakshi News home page

తవ్వినకొద్దీ అక్రమాలే..!

Oct 16 2026 1:00 AM | Updated on Oct 16 2026 1:00 AM

జెడ్పీ డిప్యూటీ సీఈఓకు ఫిర్యాదు..

–IIలో u

కోస్గి: మండలంలోని మీర్జాపూర్‌లో తవ్వినకొద్ది అ క్రమాలు వెలుగు చూస్తున్నాయి. గ్రామానికి తాగు నీరు సరఫరా చేసే పంచాయతీ నీటిట్యాంకు నుంచి సీసీ రోడ్డు పనులకు నీటిని అమ్ముకోవడం, పంచా యతీ ట్రాక్టర్‌ను సొంత ప్రైవేట్‌ పనులకు విని యోగించిన ఉదాంతంపై ‘సాక్షిశ్రీలో గురువారం‘యథేచ్చగా దోచేస్తున్నారు..!’ శీర్షికన కథనం ప్రచురితమైంది. ఈ క్రమంలో గ్రామంలో జరిగిన అవకతవకలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. గ్రామ శివారులోని శ్మశానవాటికలో ఏర్పాటుచేసిన నర్సరీలో అధికారికంగా 5 వేల మొక్కలు పెంచుతున్నట్లు రికార్డుల్లో నమోదు చేశారు. 2 వేల వరకు మొక్కలు పంపిణీ చేసి నీరు లేకపోవడంతో ఆగస్టులోనే నర్సరీని వదిలేసినట్లు పంచాయతీ కార్యదర్శి బసప్ప చెబుతుండగా.. ఫీల్డ్‌ అసిస్టెంట్‌గా పనిచేస్తున్న సర్పంచ్‌ భర్త నర్సింహులు మాత్రం ఈ నెల 7 వరకు నర్సరీలో పనులు చేసినట్లు.. డబ్బులు సైతం వారి బ్యాంకు ఖాతాల్లో జమ చేయడం విశేషం. అయితే నర్సరీకి సంబంధించిన కూలి డబ్బులు పొందిన వారు ఫీల్డ్‌ అసిస్టెంట్‌ బంధువులు కావడం మరో విశేషం.

కోస్గి ఎంపీడీఓ కార్యాలయంలోని సమావేశ మందిరంలో గురువారం మండల అధికారులతో జెడ్పీ డిప్యూటీ సీఈఓ సుజాత ఎల్‌నినో ప్రభావంపై ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ క్రమంలో మీర్జాపూర్‌ గ్రామస్తులు గ్రామంలో జరిగిన అక్రమాలపై పూర్తి వివరాలతో ఫిర్యాదు చేశారు. ఇందుకు స్పందించిన ఆమె పూర్తిస్థాయిలో విచారణ చేపట్టాలని.. ప్రభుత్వ నిధులు దుర్వినియోగమైనట్లు గుర్తిస్తే బాధ్యుల నుంచి రి కవరి చేయాలని ఎంపీడీఓ శ్రీధర్‌ను ఆదేశించారు. ఏ దేమైనా గ్రామంలో జరిగిన అక్రమాలపై సమ గ్ర విచారణ జరిపి బాధ్యులైన వారిపై చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు కోరుతున్నారు.

మీర్జాపూర్‌లో నర్సరీ లేకపోయినా.. నిర్వహణ పేరుతో బిల్లుల చెల్లింపు

ఈ నెల 7 వరకు కూలీలు పని చేసినట్లు మస్టర్‌లో నమోదు

పొంతన లేని సమాధానాలిస్తున్న

పంచాయతీ కార్యదర్శి

‘సాక్షి’ కథనంతో మరిన్ని వెలుగులోకి..

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement