సిబ్బంది సంక్షేమానికి పెద్దపీట : ఎస్పీ | - | Sakshi
Sakshi News home page

సిబ్బంది సంక్షేమానికి పెద్దపీట : ఎస్పీ

Oct 16 2026 1:00 AM | Updated on Oct 16 2026 1:00 AM

నారాయణపేట: సిబ్బంది సంక్షేమం, వారి సమస్యల పరిష్కారానికి ప్రాధాన్యతనిస్తున్నామని ఎస్పీ డా. వినీత్‌ తెలిపారు. గురువారం జిల్లా పోలీసు కార్యాల యంలోని కాన్ఫరెనన్స్‌ హాల్‌లో జిల్లా ఆర్మ్‌డ్‌ రిజర్వ్‌ పోలీస్‌ సిబ్బందితో నిర్వహించిన పోలీస్‌ దర్బార్‌లో ఆయన పాల్గొన్నారు. సిబ్బంది సర్వీసుకు సంబంధించిన అంశాలు, విధుల కేటాయింపు, విధి నిర్వహణలో ఎదురవుతున్న సమస్యలు, ఇతర ఇబ్బందులను స్వయంగా అడిగి తెలుసుకున్నారు. సమస్యలను క్షుణ్ణంగా పరిశీలించి నిబంధనల మేరకు పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. సిబ్బంది సమస్యలను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించేందుకు పోలీస్‌ దర్బార్‌ మంచి వేదికగా ఉపయోగపడుతుందని తెలిపారు. పోలీస్‌శాఖలో క్రమశిక్షణ, సమయపాలన అత్యంత ముఖ్యమని, విధులకు సకాలంలో హాజరుకావడం, ఉన్నతాధికారుల ఆదేశాలను పాటించడం, అప్పగించిన బాధ్యతలను సమర్థవంతంగా నిర్వర్తించడం ప్రతి ఒక్కరి కర్తవ్యమని స్పష్టం చేశారు. యూనిఫామ్‌ను పరిశుభ్రంగా ఉంచుకోవడంతో పాటు విధి నిర్వహణలో వృత్తిపరమైన హుందాతనాన్ని ప్రదర్శించాలని సూచించారు. ప్రవర్తన, క్రమశిక్షణ ప్రజల్లో పోలీస్‌శాఖపై నమ్మకాన్ని పెంపొందిస్తాయని పేర్కొన్నారు. ప్రజలకు సేవచేసే అవకాశం పోలీస్‌శాఖలో పనిచేసే ప్రతి ఒక్కరికీ లభిస్తుందని.. సమస్యలను ఓపికగా వినాలని, బాధితులకు న్యాయం జరిగేలా చట్టపరిధిలో చర్యలు తీసుకోవాలని సూచించారు. ఫిర్యాదుదారులతో మర్యాదగా వ్యవహరించాలని.. వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపర్చుకుంటూ బాధ్యతాగా విధులు నిర్వహించాలని పిలుపునిచ్చారు. జిల్లాలో శాంతిభద్రతల పరిరక్షణలో ఆర్మ్‌డ్‌ రిజర్వ్‌ పోలీసుల పాత్ర కీలకమని పేర్కొన్నారు. సిబ్బంది అంకితభావంతో పనిచేస్తూ జిల్లా పోలీస్‌శాఖతో పాటు తెలంగాణ పోలీస్‌శాఖకు మంచి పేరు తీసుకురావాలని సూచించారు. సిబ్బంది సంక్షేమానికి అవసరమైన సహకారం అందించేందుకు జిల్లా పోలీస్‌శాఖ కృషి చేస్తుందని తెలిపారు. కార్యక్రమంలో అదనపు ఎస్పీ ఎండీ రియాజ్‌ ఉల్‌హక్‌, ఆర్‌ఐ విజయభాస్కర్‌, ఆర్‌ఎస్‌ఐ శిరీష పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement