మహిళలే యజమానులు! | - | Sakshi
Sakshi News home page

మహిళలే యజమానులు!

Oct 8 2026 3:48 AM | Updated on Oct 8 2026 3:48 AM

అద్దె బస్సుల భారం తగ్గింది..

ఏడాదిలోనే మహబూబ్‌నగర్‌ రీజియన్‌ పరిధిలో 65 బస్సులు కేటాయింపు

బస్సే పెట్టుబడి..

దేశాభివృద్ధి, సంక్షేమానికి అధిక ప్రాధాన్యం

నారాయణపేట: ప్రధాని మోదీ నాయకత్వంలో భారత్‌ ప్రపంచంలో మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఎదగడం గర్వించదగ్గ విషయమని ఎమ్మెల్సీ ఏవీఎన్‌ రెడ్డి అన్నారు. కేంద్ర, రాష్ట్ర పార్టీ ఆదేశాల మేరకు సేవా సంకల్ప్‌ అభియాన్‌లో భాగంగా జిల్లాకేంద్రంలోని ఓ గార్డెన్స్‌లో బుధవారం బీజేపీ ఆధ్వర్యంలో ‘సేవా జ్యోతి’ కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమంలో భాగంగా ప్రధానమంత్రి నరేంద్రమోదీ ప్రసంగాన్ని డిజిటల్‌ స్క్రీన్‌పై పార్టీ నాయకులు, కార్యకర్తలు వీక్షించారు. అనంతరం సత్యనారాయణ చౌక్‌ వరకు కాగడాల ప్రదర్శన నిర్వహించారు. సేవాభావాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లడంతో పాటు పార్టీ సిద్ధాంతాలను ప్రజలకు చేరువ చేయడమే కార్యక్రమం ముఖ్య ఉద్దేశమని నాయకులు తెలిపారు. అంతకుముందు సమావేశంలో ఎమ్మెల్సీ మాట్లాడుతూ.. దేశ అభివృద్ధి, సంక్షేమం, రక్షణకు కేంద్ర ప్రభుత్వం ప్రాధాన్యం ఇస్తోందని పేర్కొన్నారు. ఎలక్ట్రిక్‌ వాహనాల వినియోగం పెరగడంతో పెట్రోల్‌, డీజిల్‌పై ఆధారపడటం కొంతవరకు తగ్గిందన్నారు. రక్షణరంగంలోనూ స్వయం సమృద్ధి సాధిస్తూ దేశంలోనే ఆయుధాలను తయారు చేసే స్థాయికి చేరుకున్నామని పేర్కొన్నారు. పుర చైర్‌పర్సన్‌ కొండ శ్వేత, వైస్‌ చైర్మన్‌ మంజుల, బీజేపీ రాష్ట్ర, జిల్లా నాయకులు రతంగ్‌పాండురెడ్డి, కొండయ్య, పున్నంచంద్‌ లాహోటి, సత్యయాదవ్‌, రఘురామయ్యగౌడ్‌, బలరాంరెడ్డి, లక్ష్మి, మహబూబ్‌ అలీ, కిరణ్‌ పాల్గొన్నారు.

మహబూబ్‌నగర్‌ మున్సిపాలిటీ: గ్రామీణ మహిళా సంఘాల సభ్యులను కోటీశ్వరులను చేయాలనే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన బస్సుల కేటాయింపుతో వారికి అదనపు ఆదాయం సమకూరుతోంది. ఇప్పటికే సీ్త్రనిధి, బ్యాంకు లింకేజీ కింద తక్కువ వడ్డీకి రుణాలు ఇస్తోంది. అలాగే ఏటా విద్యార్థుల యూనిఫాం కుట్టే (స్టిచ్చింగ్‌) పనిని సైతం అప్పగించిన విషయం విదితమే. ఇందులో భాగంగా అద్దె బస్సుల పథకం కింద ఏకంగా సెర్ప్‌ నుంచి రూ.30 లక్షల గ్రాంట్‌ రావడం.. దీనిని ప్రభుత్వానికి తిరిగి చెల్లించాల్సిన అవసరం లేకపోవడంతో మండల మహిళా సమాఖ్యలకు ఎంతో వెసులుబాటు కలిగింది. తమ వాటా కింద కేవలం రూ.6 లక్షలు మాత్రమే భరిస్తే చాలు ఏకంగా బస్సు యజమానులుగా రిజిస్ట్రేషన్‌ చేయిస్తున్నారు. వీటిని ఆర్టీసీ 84 నెలల పాటు ఒక్కో బస్సును లీజుకు తీసుకుని ఏకంగా ప్రతి నెలా రూ.69,468 చొప్పున అద్దె రూపంలో చెల్లిస్తోంది. ఇక ఈ బస్సుల నిర్వహణకు అయ్యే ఖర్చులు సైతం సంస్థనే భరిస్తుండటంతో ఇది వారికి వరంగా మారింది. ఈ మొత్తం మండల మహిళా సమాఖ్య ఖాతాలో నేరుగా జమ అవుతుండటంతో అవసరమైన సభ్యులకు అత్యవసర సమయంలో కావాల్సిన రుణం ఇస్తూ ఎంతో ఆసరాగా నిలుస్తున్నారు.

డిపోల వారీగా బస్సుల కేటాయింపు ఇలా..

మహబూబ్‌నగర్‌ రీజియన్‌ పరిధిలోని పది డిపోలలో ప్రస్తుతం ఆర్టీసీవి చెందినవి 455, ప్రైవేట్‌ కాంట్రాక్టర్లవి 360, మండల మహిళా సమాఖ్యలవి 65, జేబీఎంవీ 23 ఇలా మొత్తం 903 బస్సులు నడుస్తున్నాయి. వీటిలో షాద్‌నగర్‌ డిపోనకు 18, మహబూబ్‌నగర్‌కు 16, వనపర్తికి 14, నారాయణపేట, గద్వాలకు 4 చొప్పున, నాగర్‌కర్నూల్‌, కల్వకుర్తి, అచ్చంపేట, కొల్లాపూర్‌కు 2 చొప్పున; కోస్గికి 1 మండల మహిళా సమాఖ్యకు చెందిన బస్సులను ఆర్టీసీ అద్దెకు తీసుకుంది. భవిష్యత్తులో సంస్థకు చెందిన బస్సులు ఎక్కడైనా కాలం (15 ఏళ్లు దాటిన) చెల్లినవి ఉంటే వాటి స్థానంలో మండల మహిళా సమాఖ్యల ద్వారానే కొత్త బస్సులు అద్దెకు తీసుకుని నడిపించనున్నారు.

ప్రైవేట్‌ కాంట్రాక్టర్‌కు చెందిన అద్దె బస్సుకు ప్రతినెలా రూ.1.20 లక్షల నుంచి రూ.1.30 లక్షల వరకు చెల్లించాల్సి వస్తోంది. అలాంటి రాష్ట్ర ప్రభుత్వమే మండల మహిళా సమాఖ్యలకు గ్రాంట్‌ కింద బస్సులు కొనుగోలు చేసి ఇస్తోంది. వీటికి అద్దె రూపంలో కేవలం రూ.69 వేల పైచిలుకు మాత్రమే చెల్లిస్తున్నాం. ఈ పథకం అమలుతో మా సంస్థకు అద్దె బస్సుల భారం తగ్గినట్లే. కాలం చెల్లిన బస్సుల స్థానంలో దశల వారీగా మండల సమాఖ్య బస్సులనే వినియోగిస్తాం. – పి.సంతోష్‌కుమార్‌, ఆర్‌ఎం, మహబూబ్‌నగర్‌ రీజియన్‌

షాద్‌నగర్‌ డిపో పరిధిలో

అత్యధికంగా 18

కొత్త బస్సుకు సెర్ప్‌ నుంచి

రూ.30 లక్షల గ్రాంట్‌

మహిళా సమాఖ్య వాటా

రూ.6 లక్షలు.. ఆర్టీసీ నుంచి నెలకు రూ.69,468 అద్దె

అదనపు ఆదాయంతో

ఆర్థికంగా చేయూత

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement