నారాయణపేట ఎడ్యుకేషన్: తెలంగాణ రాష్ట్ర స్కూల్ గేమ్ సెక్రెటరీ ఆదేశాల మేరకు ఈ నెల 10న మక్తల్‌లో ఎస్జీఎఫ్ జిల్లాస్థాయి అండర్–14, 17, 19 బాల బాలికల 5 కిలోమీటర్ల రోడ్ సైక్లింగ్ పోటీలు నిర్వహించనున్నట్లు ఎస్జీఎఫ్ జిల్లా కార్యదర్శి శ్రీనివాస్‌రెడ్డి బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ పోటీల్లో ప్రతిభ కనబర్చిన వారిని నెలాఖరున సిద్ధిపేట జిల్లాలో జరిగే రాష్ట్రస్థాయి సైక్లింగ్ పోటీలకు ఎంపిక చేస్తామని పేర్కొన్నారు. ఆసక్తిగల బాల బాలికలు బోనాఫైడ్, ఆధార్‌కార్డు, ఎస్ఎస్సీ మెమో, రెండు పాస్‌పోర్టు సైజ్ ఫొటోలు, సొంత సైకిల్‌తో పాటు క్రీడాదుస్తులు ధరించి ఉదయం 9 గంటల వరకు విశ్రాంత పీఈటీ గోపాలంకు వివరాలు అందించాలని సూచించిరు. మరిన్ని వివరాలకు సెల్‌నంబర్ 77027 13139 సంప్రదించాలని కోరారు.
వీబీజీ రాంజీ పనుల్లో నాణ్యత పాటించాలి
ఊట్కూర్: వీబీజీ రాంజీ పనుల్లో నాణ్యత పాటించి గడువులోగా పూర్తి చేయాలని జెడ్పీ సీఈఓ వెంకట్రాములు అన్నారు. బుధవారం మండలంలోని పులిమామిడిలో కొనసాగుతున్న కందకాలు, నీటికుంటలు తదితర పనులను ఆయన పరిశీలించి కూలీల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం నిర్ణీత గడువులోగా పనులు పూర్తి చేయాలని సూచించారు. పనుల్లో నాణ్యత లోపించొద్దని.. నిర్లక్ష్యం సరికాదని అధికారులను హెచ్చరించారు. ఆయన వెంట ఎంపీడీఓ పావని, ఏపీఓ లక్ష్మారెడ్డి ఉన్నారు.
రాష్ట్రస్థాయి యోగాసన పోటీలకు ఎంపిక
నర్వ: ఎస్జీ ఎఫ్ ఉమ్మడి జిల్లా యోగా సన చాంపియ న్షిప్లో పెద్దకడ్మూర్ పీఎంశ్రీ జెడ్పీ ఉన్న త పాఠశాల విద్యార్థినులు అద్భుతమైన ప్రతిభ కనబర్చి రాష్ట్రస్థాయికి ఎంపికై నట్లు జీహెచ్ఎం భాగ్యలక్ష్మి బుధవారం తెలిపారు. అండర్–17 ఆర్టిస్టిక్ యోగాసన విభాగంలో జానకి ప్రథమ స్థానం.. అలాగే అండర్–14 విభాగంలో జె.జానకి ద్వితీయ స్థానంతో పాటు ఆర్టిస్టిక్ యోగాసన విభాగంలో ప్రథమ స్థానంలో నిలిచినట్లు వివరించారు. ఈ నెల 11, 12, 13 తేదీల్లో సిద్దిపేటలో జరిగే రాష్ట్రస్థాయి పోటీల్లో వీరు పాల్గొననున్నారన్నారు. ఈ సందర్భంగా యోగా ట్రైనర్ రామాంజనేయులు, విద్యార్థులను ఉపాధ్యాయులు, గ్రామస్తులు అభినందించారు.


