మరుగుదొడ్లకు మోక్షం! | - | Sakshi
Sakshi News home page

మరుగుదొడ్లకు మోక్షం!

Oct 7 2026 1:46 AM | Updated on Oct 7 2026 1:46 AM

మహబూబ్‌నగర్‌ ఎడ్యుకేషన్‌: ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక వసతుల కొరతకు చెక్‌ పెట్టే దిశగా ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఉమ్మడి మహబూబ్‌నగర్‌ జిల్లాలో మరుగుదొడ్ల సదుపాయం లేని, ఉన్నా విద్యార్థుల సంఖ్యకు సరిపోని పాఠశాలలను గుర్తించి కొత్తగా 764 మరుగుదొడ్ల నిర్మాణానికి అనుమతులు మంజూరు చేసింది. ఇందులో 670 ప్రైమరీ పాఠశాలలు, 94 హైస్కూళ్లు ఉన్నాయి. ఒక్కో మరుగుదొడ్డి నిర్మాణానికి రూ.4.80 లక్షల చొప్పున కేటాయించగా.. మొత్తం రూ.36.67 కోట్ల మేర నిధులు వెచ్చించనున్నారు. కొన్ని పాఠశాలల్లో మరుగుదొడ్లు పూర్తిగా లేకపోగా.. మరికొన్ని చోట్ల పాతవి శిథిలావస్థకు చేరడం, విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా లేకపోవడంతో అదనపు యూనిట్లను మంజూరు చేశారు. పాఠశాలల్లో వసతుల మెరుగుదలతో విద్యార్థుల హాజరు, అడ్మిషన్లు పెరిగే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు.

మణికొండకు 8 టాయిలెట్లు

మహబూబ్‌నగర్‌ రూరల్‌ మండలం యూపీఎస్‌ మణికొండలో 244 మంది విద్యార్థులు చదువుతున్నారు. పాత మరుగుదొడ్లను తొలగించి కొత్తవి నిర్మించినా అవి ఇంకా అందుబాటులోకి రాలేదు. దీంతో పాఠశాలకు ఏకంగా ఎనిమిది మరుగుదొడ్లు మంజూరయ్యాయి. గద్వాల యూపీఎస్‌ మెడికొండకు నాలుగు, యూపీఎస్‌ ఇందువాసికి ఐదు, యూపీఎస్‌ నందిన్నెకు ఆరు చొప్పున మంజూరయ్యాయి. 70 పాఠశాలలకు రెండు, 35 పాఠశాలలకు మూడు, 10 పాఠశాలలకు నాలుగు చొప్పున టాయిలెట్లు మంజూరు చేశారు.

ఉమ్మడి జిల్లాలో 764 టాయిలెట్ల నిర్మాణానికి సర్కారు గ్రీన్‌సిగ్నల్‌

436 ప్రైమరీ, 73 హైస్కూళ్లకు మంజూరు

ఒక్కో టాయిలెట్‌కు రూ.4.80 లక్షలు.. మొత్తం రూ.36.67 కోట్లు

విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా అదనపు వసతులు

అడ్మిషన్లు పెరిగే అవకాశం

ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక వసతుల కల్పనలో భాగంగా మరుగుదొడ్ల నిర్మాణానికి నిధులు మంజూరు చేయడం ఉపయోగకరమని అధికారులు పేర్కొంటున్నారు. విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా వసతులు కల్పిస్తే పాఠశాలల్లో అడ్మిషన్లు పెరిగే అవకాశం ఉందని చెబుతున్నారు. – డా. గోవిందరాజు, డీఈఓ, నారాయణపేట

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement