అనుసంధానం.. వేగవంతం | - | Sakshi
Sakshi News home page

అనుసంధానం.. వేగవంతం

Oct 7 2026 1:46 AM | Updated on Oct 7 2026 1:46 AM

జిల్లాలో నమోదు ఇలా..

నర్వ: గ్రామాల్లోని ఇళ్ల వివరాలను ఈ–పంచాయతీ ద్వారా తెలుసుకునేలా ప్రభుత్వం చర్యలు చేపట్టింది. పంచాయతీ సేవలు, ఇళ్ల వివరాలు, పన్నుల న మోదు, చెల్లింపులు స్మార్ట్‌ఫోన్‌లో తెలుసుకునేందు కు యజమాని సెల్‌నంబర్లను వెబ్‌సైట్‌లో నమో దు చేయాలని ఆదేశించింది. దీంతో అధికారులు జిల్లా లోని 13 మండలాల్లోని 272 గ్రామపంచాయతీల్లో ఇంటినంబర్లను యజమాని మొబైల్‌ నంబర్లతో అనుసంధానం చేసే ప్రక్రియ చేపడుతున్నారు.

కలిగే ప్రయోజనాలు..

●ఇంటినంబర్‌ను మొబైల్‌ నంబర్‌కు అనుసంధా నం చేయటంతో గ్రామస్తులు ఇళ్ల వివరాలను ఆన్‌లైన్‌లో ఎక్కడి నుంచైనా చూసుకునే అవకాశం ఉంటుంది.

● రానున్న రోజుల్లో యజమానులు ఇంటిపన్నును మొబైల్‌ఫోన్‌ ద్వారా ఆన్‌లైన్‌ చెల్లింపు చేసే అవకాశం ఉంటుంది.

● ఇళ్ల వివరాలను ఆన్‌లైన్‌ చేయడంతో పారదర్శకత పెరుగుతోంది.

● ఇంటిపన్నులు, ప్రభుత్వ పథకాల సమాచారాన్ని ప్రజలకు నేరుగా చేరవేయవచ్చు.

జిల్లాలో ఇలా..

జిల్లాలో మొత్తం అసెస్‌మెంట్లు 1,28,547 ఉండగా.. 84,596 పూర్తి చేశారు. మిగిలిన అసెస్‌మెంట్లు 43,951 పూర్తి చేయాల్సి ఉంది. అతి తక్కువగా మక్తల్‌, ఊట్కూర్‌, నారాయణపేట మండలాల వివరాలు నమోదు చేశాయి. మద్దూర్‌ మండలం 97.72 శాతంతో ముందంజలో ఉండగా.. కొత్తపల్లి మండలం 90 శాతానికి పైగా నమోదైంది.

వేగంగా అనుసంధాన ప్రక్రియ..

గ్రామాల్లోని ఇళ్లనంబర్లను మొబైల్‌ఫోన్‌ నంబర్లతో అనుసంధానం చేసే ప్రక్రియను పంచాయతీ అధికారులు వేగవంతం చేశారు. పంచాయతీ కార్యదర్శులు, సిబ్బంది సహకారంతో ఇంటింటికి తిరిగి ఫోన్‌నంబర్లను సేకరిస్తున్నారు. ఆ వివరాల ను ఎంపీడీఓ కార్యాలయాల్లోని ఈ–పంచాయతీ ఆపరేటర్ల ద్వారా అనుసంధానం చేస్తున్నారు.

పంచాయతీ కార్యదర్శులు యజమాని పేరు, ఆధార్‌ నంబరు, తండ్రిపేరు, చిరునామా, పిన్‌కోడ్‌ నంబర్‌, వృత్తి, ప్రదేశం తదితర వివరాలను నమోదు చేస్తున్నారు.

ఇల్లు ఆబాది సర్వేనంబర్‌లో ఉందా, ప్రైవేట్‌ లేదా ప్రభుత్వ భవనామా అనే వివరాలు సేకరిస్తున్నారు.

ప్రైవేట్‌, ప్రభుత్వ, శిఖం, ఎఫ్‌టీఎల్‌ ప్రాంతం, ఏ ప్రాంతంలో నివసిస్తున్నారో నమోదు చేయాలి.

పంచాయతీకి చెందిన ఎల్‌జీడీ కోడ్‌ ద్వారా గ్రామాల్లో ఉన్న ఇళ్ల వివరాలను సేకరించి మొ బైల్‌ నంబరుతో అనుసంధానం చేస్తున్నారు.

గ్రామాల్లో కొనసాగుతున్న

ఇంటినంబర్ల ఆన్‌లైన్‌ ప్రక్రియ

జిల్లాలో ఇప్పటి వరకు 65 శాతం పూర్తి

సకాలంలో పూర్తి చేసేందుకు

అధికారుల కసరత్తు

పూర్తయితే ఆన్‌లైన్‌లోనే

పన్ను చెల్లింపునకు అవకాశం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement