పనుల్లో వేగం పెంచాలి : కలెక్టర్‌ | - | Sakshi
Sakshi News home page

పనుల్లో వేగం పెంచాలి : కలెక్టర్‌

Oct 7 2026 1:46 AM | Updated on Oct 7 2026 1:46 AM

దామరగిద్ద: అదనపు తరగతి గదుల నిర్మాణాలు తుదిదశలో ఉన్నందున త్వరితగతిన పూర్తిచేసి వినియోగంలోకి తీసుకురావాలని కలెక్టర్‌ సీహెచ్‌ ప్రి యాంక ఆదేశించారు. మంగళవారం మండలంలో ని కస్తూర్బాగాంధీ విద్యాలయను ఆమె ఆకస్మికంగా తనిఖీ చేసి అదనపు గదుల నిర్మాణ పనులను పరిశీలించారు. విద్యార్థులతో మాట్లాడి వసతులు, భోజనం, బోధనపై ఆరా తీశారు. భోజన నాణ్యత, రోజు వారీ మెనూ, స్టోర్‌ రూంను పరిశీలించారు. కళాశా ల, ఒకేషనల్‌ కోర్సులు చదువుతున్న విద్యార్థులతో మాట్లాడి వారి లక్ష్యాలను అడిగి తెలుసుకున్నారు. విద్యార్థులు చదువుతో పాటు ఆరోగ్యంపై శ్రద్ధ వహించాలన్నారు. పాఠశాల ఆవరణలో నిరుపయోగంగా ఉన్న ఫర్నీచర్‌ గురించి సంబంధిత అధికారులను అడిగి తెలుసుకున్నారు. పాత భవనంలో పాఠశాల, కళాశాల నిర్వహణకు గదులు సరిపోవడం లేదని ఎస్‌ఓ స్వాతి కలెక్టర్‌ దృష్టికి తీసుకురాగా నిర్మాణం పూర్తయ్యే వరకు కింది అంతస్తులో ఉన్న అదనపు గదులను తరగతుల నిర్వహణకు వినియోగించుకోవాలని సూచించారు. డైనింగ్‌ షెడ్‌ ఎత్తు పెంచి పక్షులు లోనికి రాకుండా అవసరమైన పనులకు ప్రతిపాదనలు సిద్ధం చేయాలని ఎస్‌ఓను ఆదేశించారు. పనులు త్వరగా పూర్తయ్యేలా పర్యవేక్షణ చేపట్టాలని డీఈఓ గోవిందరాజును ఫోన్‌లో సూచించారు. కలెక్టర్‌ వెంట తహసీల్దార్‌ తిరుపతయ్య, ఎంపీడీఓ సాయిలక్ష్మి ఉన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement