ఊట్కూర్: పార్టీ పటిష్టతకు కృషిచేద్దామని బీజేపీ జిల్లా అధ్యక్షుడు సత్యయాదవ్ కోరారు. మంగళవారం మండల కేంద్రంలో నిర్వహించిన మండల కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడారు. రాబోవు ఎమ్మెల్సీ ఎన్నికలకు నాయకులు, కార్యకర్తలు సన్నద్ధం కావాలన్నారు. డిగ్రీ పూర్తయిన వారిని గుర్తించి ఆన్లైన్లో ఓటరుగా నమోదు చేయించే బాధ్యత కార్యకర్తలదేనని తెలిపారు. బీజేపీ కార్యకర్తలు క్రమశిక్షణకు మారుపేరని.. విభేదాలు పక్కనబెట్టి పార్టీ అభ్యర్థి గెలుపునకు కష్టపడి పనిచేయాలని సూచించారు. మండలంలో 8 మంది బీజేపీ మద్దతు సర్పంచ్లు ఉండటం అభినందనయమన్నారు. అనంతరం ఆయా సర్పంచ్లను సన్మానించారు. కార్యక్రమంలో పార్టీ రాష్ట్ర నాయకులు కొండయ్య, భాస్కర్, కర్నె స్వామి, బల్రాంరెడ్డి, చంద్రశేఖర్గౌడ్, నర్సింహారెడ్డి, భరత్, కృష్ణయ్యగౌడ్, ఆశప్ప తదితరులు పాల్గొన్నారు.


