ఓపెన్‌ స్కూల్‌తో విద్యా ప్రమాణాలు మెరుగు | - | Sakshi
Sakshi News home page

ఓపెన్‌ స్కూల్‌తో విద్యా ప్రమాణాలు మెరుగు

Oct 7 2026 1:46 AM | Updated on Oct 7 2026 1:46 AM

మరికల్‌: ఆర్థిక ఇబ్బందులతో మధ్యలో చదువు మానేసిన విద్యార్థులు ఓపెన్‌ స్కూల్‌ ద్వారా తమ విద్యా ప్రమాణాలను మెరుగుపర్చుకోవచ్చని రాష్ట్ర ఓపెన్‌ స్కూల్‌ కో–ఆర్డినేటర్‌ క్రాంతిరెడ్డి అన్నారు. మంగళవారం ఎంపీడీఓ కార్యాలయంలో మహిళా సమైఖ్య సభ్యులు, ఇతరులకు ఓపెన్‌ స్కూల్‌ విద్యపై హైదరాబాద్‌ కళాజాతతో అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. మహిళా సమైఖ్య సభ్యులు గ్రామాల్లో చదువు మధ్యలో మానేసిన వారిని గుర్తించి ఓపెన్‌ పది, ఇంటర్‌లో చేరేవిధంగా అవగాహన కల్పించాలన్నారు. ఇందుకు ప్రతి ఒక్కరి సహకారం ఉంటేనే నిరుద్యోగ సమస్య పరిష్కారమవుతుందని తెలిపారు. అనంతరం ఓపెన్‌ స్కూల్‌ ప్రవేశాల వాల్‌పోస్టర్‌ను విడుదల చేశారు. కార్యక్రమంలో ఓపెన్‌ స్కూల్‌ ఎడ్యుకేటెడ్‌ ప్రతినిధి ప్రణవ, ఉమ్మడి జిల్లా కో–ఆర్డినేటర్‌ శివయ్య, జిల్లా కో–ఆర్డినేటర్‌ శ్రీనివాస్‌, తహసీల్దార్‌ రాంకోటి, ఏపీఎం చంద్రశేఖర్‌, విద్యాసాగర్‌, చెన్నారెడ్డి, శ్రీధర్‌ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement