జాతీయస్థాయి పోటీలకు ఎంపికలు | - | Sakshi
Sakshi News home page

జాతీయస్థాయి పోటీలకు ఎంపికలు

Oct 5 2026 12:45 AM | Updated on Oct 5 2026 12:45 AM

నారాయణపేట ఎడ్యుకేషన్‌: హైదరాబాద్‌లో ఈ నెల 14 నుంచి 16వ తేదీ వరకు జరిగే జాతీయస్థా యి జూనియర్‌ అథ్లెటిక్స్‌ పోటీల్లో పాల్గొనే జిల్లా అథ్లెట్లను ఆదివారం స్థానిక స్టేడియంలో ఎంపిక చేశారు. ఈ పోటీలకు జిల్లా నలుమూలల నుంచి 200 మంది క్రీడాకారులు హాజరు కాగా.. రాష్ట్ర అథ్లెటిక్స్‌ పరిశీలకుడు శరత్‌చంద్ర ఆధ్వర్యంలో పలు విభాగాల్లో ఎంపిక పోటీలు నిర్వహించారు. అండర్‌–14 ట్రయాథ్లాన్‌ ఏ,బీ,సీ, అండర్‌–16 విభాగంలో 600 మీటర్ల పరుగుపందెం, 80 మీటర్ల హర్డిల్‌, షాట్‌ఫుట్‌, లాంగ్‌ జంప్‌, హైజంప్‌, జావెలిన్‌ త్రో, పెంటాథ్లాన్‌ పోటీలు నిర్వహించినట్లు జిల్లా అథ్లెటిక్స్‌ అసోసియేషన్‌ ప్రధాన కార్యదర్శి రమణ తెలిపారు. ఆయా విభాగాల్లో ప్రతిభకనబరిచిన 13 మంది క్రీడాకారులను ఎంపిక చేసినట్లు పేర్కొన్నా రు. కార్యక్రమంలో లయన్స్‌ క్లబ్‌ అధ్యక్షు డు రవికుమార్‌గౌడ్‌, తపస్‌ రాష్ట్ర గౌరవాధ్యక్షుడు గుంపు బాలరాజు, భీష్మరాజ్‌ ఫౌండేషన్‌ సభ్యుడు తిప్పన్న, కోచ్‌లు జగదీశ్‌, బీరప్ప, మహేశ్‌, భరత్‌, వ్యాయా మ ఉపాధ్యాయులు విద్యాసాగర్‌, యాదమ్మ, సౌమ్య, లావణ్య, శశికళ పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement