మరికల్: ప్రియదర్శిని జూరాల ప్రాజెక్టుకు ఎగువ నుంచి ఇన్ఫ్లో పూర్తిగా తగ్గడంతో ఆదివారం కోయిల్సాగర్కు అధికారులు నీటి పంపింగ్ను నిలిపివేశారు. రెండు రోజుల క్రితం ఉంద్యాల పంపుహౌజ్ వద్ద అధికారులు మోటార్లను నిలిపివేయడంతో కోయిల్సాగర్కు వచ్చే నీటి ప్రవాహం తగ్గింది. జూరాల నుంచి నీటి పంపింగ్ నిలిచిపోవడంతో తీలేర్ పంపుహౌజ్ వద్ద కూడా కోయిల్సాగర్కు పంపింగ్ చేస్తున్న మోటార్లను బంద్ చేశారు. ప్రస్తుతం కోయిల్సాగర్లో 20 అడుగుల మేర నీటిమట్టం ఉందని అధికారులు తెలిపారు. కాగా, గోటూర్, పూసల్పహాడ్, రాకొండ, పెద్దచింతకుంట గ్రామాల్లో సాగుచేసిన వరిపంటకు నీరు లేక ఎండుముఖం పట్టింది. అయితే ఆయకట్టు రైతులను దృష్టిలో ఉంచుకొని కోయిల్సాగర్ కుడి కాల్వ ద్వారా మరో రెండు రోజులపాటు నీరు వదులుతామని అధికారులు తెలిపారు.


