గాంధీ, శాస్త్రి ఆశయాలు స్ఫూర్తిదాయకం.. | - | Sakshi
Sakshi News home page

గాంధీ, శాస్త్రి ఆశయాలు స్ఫూర్తిదాయకం..

Oct 3 2026 1:14 AM | Updated on Oct 3 2026 1:14 AM

జాతిపిత మహాత్మాగాంధీ, మాజీ ప్రధాని లాల్‌ బహదూర్‌ శాస్త్రి ఆశయాలు నేటితరానికి స్ఫూర్తిదాయకమని ఎస్పీ డా. వినీత్‌ అన్నారు. గాంధీ, శాస్త్రి జయంతి సందర్భంగా శుక్రవారం జిల్లా పోలీస్‌ కార్యాలయంలో నిర్వహించిన కార్యక్రమంలో ఆయన పాల్గొని వారి చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. సత్యం, అహింసను ఆయుధాలుగా చేసుకొని స్వాతంత్య్ర ఉద్యమాన్ని నడిపిన మహనీయుడు గాంధీజీ అని కొనియాడారు. గాంధీజీ కలలుగన్న మాదక ద్రవ్యాలు, మద్యపానం లేని సమాజం, మహిళలకు భద్రత, గ్రామీణాభివృద్ధి కోసం ప్రతి ఒక్కరూ బాధ్యతగా పని చేయాలని సూచించారు. లాల్‌ బహదూర్‌ శాస్త్రి జై జవాన్‌.. జై కిసానన్‌ నినాదంతో దేశ రక్షణలో సైనికులు, ఆహార భద్రతలో రైతుల పాత్రను చాటిచెప్పారని అన్నారు. నిజాయితీ, నిరాడంబరత, దేశభక్తికి శాస్త్రి జీవితం ప్రతీకగా నిలిచిందని తెలిపారు. మహనీయుల ఆశయాలను స్మరించుకోవడంతో పాటు వాటిని నిత్య జీవితంలో ఆచరించడమే వారికిచ్చే నిజమైన నివాళి అని పేర్కొన్నారు. కార్యక్రమంలో డీఎస్పీలు మహేష్‌, నల్లపు లింగయ్య, సీఐలు శివశంకర్‌, రాంలాల్‌, భగవంత్‌రెడ్డి, సైదులు, ఆర్‌ఐ విజయభాస్కర్‌, సాయుధ దళాలు, పోలీస్‌ కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement