కొత్తపల్లి: కొత్తపల్లి, గుండుమాల్ మండలాల్లోని కొమ్మూరు, వీరారం, పెద్దాపూర్, లింగాల్చేడ్, నిడ్జింత గ్రామాల్లో శుక్రవారం జిల్లా ఉద్యాన, పట్టు పరిశ్రమశాఖ అధికారి వీవీఎస్ సాయిబాబా ఆయిల్‌పాం, కూరగాయలు, పండ్లతోటల్లో చీడపీడల నివారణ, సస్యరక్షణ చర్యలు, సమగ్ర యాజమాన్య పద్ధతులపై రైతులకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రభుత్వం తుంపర, బిందు సేద్యం పరికరాలను రాయితీపై అందిస్తోందని.. సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. అలాగే శాశ్వత పందిరి, పూల తోటలు, మల్చింగ్‌కు దరఖాస్తు చేసుకోవాలన్నారు.
జాతీయ అత్యాపత్యా పోటీలకు ఎంపిక
ధన్వాడ: మండలంలోని కొండాపూర్ గిరిజన గురుకుల పాఠశాల 10వ తరగతి విద్యార్థి శ్రీకాంత్ సబ్ జూనియర్ జాతీయ అత్యాపత్యా ఛాంపియన్షిప్ పోటీలకు ఎంపికై నట్లు ప్రిన్సిపాల్ రాజారాం శుక్రవారం తెలిపారు. ఈ నెల 4, 5 తేదీల్లో హైదరాబాద్‌లోని ఎల్బీ ఇండోర్ స్టేడియంలో జరిగే పోటీల్లో రాష్ట్రస్థాయి జట్టుకు శ్రీకాంత్ ప్రాతినిథ్యం వహిస్తారని చెప్పారు. సెప్టెంబర్ 26 నుంచి అక్టోబర్ 2 వరకు జరిగిన జాతీయస్థాయి ఎంపిక శిక్షణా శిబిరంలో పాల్గొన్నారని వివరించారు. గతంలోనూ రాష్ట్రస్థాయి పోటీల్లో పాల్గొని ప్రతిభ చాటారని తెలిపారు. ఈ సందర్భంగా విద్యార్థిని ప్రిన్సిపాల్‌తో పాటు పీఈటీ ఆంజనేయులు, నెట్‌బాల్ కోచ్ డా. రామ్మోహన్‌గౌడ్, ఉపాధ్యాయులు, అధ్యాపకులు, తోటి విద్యార్థులు అభినందనలు తెలిపారు.


