దామరగిద్ద: ఈ ప్రాంతంలో ఉచితంగా లభించే సీతాఫలాలను సేకరించి విక్రయించడంతో రైతు కూలీలకు ఉపాధి లభిస్తుందని.. సద్వినియోగం చేసుకోవాలని డీఆర్డీఓ వెంకట్రాములు అన్నారు. శుక్రవారం మండల కేంద్రంలోని మండల మహిళా సమాఖ్య కార్యాలయంలో సీతాఫల్ ప్రాసెసింట్ యూనిట్‌ను ఆయన ప్రారంభించి మాట్లాడారు. ఏ గ్రేడ్ కిలోకు రూ.15, బి– గ్రేడ్‌కు రూ.13 చొప్పున చెల్లిస్తున్నామని తెలిపారు. విక్రయించిన వెంటనే నగదు చెల్లించేలా చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు. కార్యక్రమంలో కంపెనీ చైర్మన్ నాగమణి, వైస్ చైర్మన్ సుజాత, పీడీఎం జయన్న, డీఎల్పీఓ ఉదయ్‌శంకర్, సెర్ప్ మార్కెటింగ్ మేనేజర్ మారుతి, తహసీల్దార్ తిరుపతయ్య, ఎంపీడీఓ సాయిలక్ష్మి, సర్పంచ్ కన్కిరెడ్డి, సీఈఓ ప్రశాంత్, సీసీ కిష్టప్ప, అంజిలప్ప, హన్మంతు పాల్గొన్నారు.


