● మక్తల్ మండలం జక్లేర్, గుడిగండ్ల శివారుల్లోని గుట్టల నుంచి గత కొంతకాలంగా మట్టిని తరలిస్తున్నారు. జాతీయ రహదారి పనుల పేరుతో గుడిగండ్ల గుట్ట నుంచి వారం రోజులుగా మట్టి రవాణా చే స్తున్నారు.అయినప్పటికీ ప్రజాప్రతినిధులు ప్రశ్నించడం లేదు. అధికారులు పట్టించుకోవడం లేదు.
●ధన్వాడ మండలం గున్ముక్ల, మంత్రోనిపల్లి, ఎ మ్మోనోనిపల్లి, కొండాపూర్ గుట్టల నుంచి మట్టి అ క్రమ రవాణా జోరుగా సాగుతోంది. ఈ విషయంపై స్థానికులు అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదనే ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి.
● మరికల్ మండలంలోని పల్లెగడ్డ, తీలేర్, మాధవరం, అప్పంపల్లి, చిత్తనూర్ శివారుల్లో ఉన్న గుట్టలపై అక్రమార్కుల కన్ను పడింది. రాత్రి, పగలు తేడా లేకుండా పోలీస్స్టేషన్ ముందు నుంచే టిప్పర్ల ద్వారా ఎర్రమట్టిని తరలిస్తున్నారు. అలాగే జూరాల – కోయిల్సాగర్ అప్రోచ్ కెనాల్కు ఇరువైపులా ఉన్న మట్టిని టిప్పర్లు, ట్రాక్టర్ల ద్వారా తరలిస్తూ సొమ్ము చేసుకుంటున్నారు. అదే విధంగా ఊట్కూరు, నర్వ, మాగనూరు, మరికల్ మండలాల్లో మట్టి దందా జోరుగా సాగుతోంది.


