దారులు వేరైనా లక్ష్యం ఒక్కటే
జిల్లాలో కీలక బాధ్యతల్లో ఉన్న మహిళలు పాలనలో తమదైన ముద్ర వేస్తున్నారు. విభిన్న హోదాలు.. భిన్న బాధ్యతలు.. కానీ లక్ష్యం ఒక్కటే.. ప్రజాసేవ. కలెక్టర్ సీహెచ్ ప్రియాంక పరిపాలనాధికారిగా జిల్లాను ముందుకు నడిపిస్తున్నారు. మహబూబ్నగర్ ఎంపీ డీకే అరుణ పార్లమెంట్ వేదికగా ప్రజా సమస్యలను ప్రస్తావిస్తున్నారు. నారాయణపేట ఎమ్మెల్యే డా. చిట్టెం పర్ణికారెడ్డి నియోజకవర్గ అభివృద్ధి, ప్రజా సమస్యలపై శాసనసభలో ప్రాతినిథ్యం వహిస్తున్నారు. నారాయణపేట పుర చైర్పర్సన్న్ కొండా శ్వేత పుర పాలనలో చైర్పర్సన్గా వ్యవహరిస్తున్నారు.


