పత్తి రైతు విలవిల | - | Sakshi
Sakshi News home page

పత్తి రైతు విలవిల

Sep 22 2026 12:36 AM | Updated on Sep 22 2026 12:36 AM

జిల్లాలో వరా్షాలు లేక ఆశించిన స్థాయిలో పత్తి పంటలు చేతికి రాకపోవడంతో దిగుబడులు తగ్గాయి. సరైన వర్షాలుంటే ఎకరాకు 12 క్వింటాళ్ల దిగుబడి వచ్చేంది. ఈ ఏడాది వర్షాలు లేకపోవడంతో ఎకరాకు రెండు క్వింటాళ్లు రాని పరిస్థితులు కనిపిస్తున్నాయి. ప్రస్తుతం రాయిచూర్‌ మార్కెట్‌లో క్వింటా పత్తికి రూ.9,650 ధర పలుకుతోంది. ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధర క్వింటాకు రూ.8,667 ఉండగా బయటి వ్యాపారులు రూ.9 వేలకు పైగా కొనుగోలు చేస్తున్నారు. ఈ ఏడాది వర్షాభావ పరిస్థితుల కారణంగా ఎండలకు పంటలు పూర్తిగా ఎండి కాపు తగ్గడంతో రైతులు పీకల్లోతు కష్టాల్లో కురుకుపోయారు. రాయిచూర్‌ మార్కెట్‌లో పత్తికి డిమాండ్‌ ఉండటంతో ఇక్కడి రైతులు కూడా ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల్లో విక్రయించకుండా నేరుగా అక్కడి మార్కెట్‌కు తరలించి విక్రయిస్తున్నారు.

మరికల్‌: ఎల్‌నినో ప్రభావంతో పత్తి రైతు కుదేలవుతున్నాడు. వర్షాలు కురుస్తాయనే ఆశతో మొదట విత్తనాలు విత్తగా వరణుడు ముఖం చాటేయడంతో మొలకెత్తలేదు. దీంతో చేసేది లేక రెండు, మూడుసార్లు విత్తాల్సి వచ్చింది. ప్రస్తుతం పంట కాయ దశలో ఉండగా వర్షాలు లేక పంట ఎండిపోతుండటంతో రైతులు దిక్కుతోచని స్థితిలో పడిపోయారు. నీటి వనరులున్న రైతులు అడపా దడపా అందిస్తూ కొద్దిమేర పంటను కాపాడుకుంటున్నారు. నీటి వనరులు లేని రైతుల పంట చూస్తే ఎండలకు మొక్కలు ఎండుముఖం పట్టడమే కాకుండా చెట్టుకు ఉన్న పూత, గూడ, కాయ రాలిపోతోంది. ప్రస్తుత సమయంలో వర్షాలు కురిసినా ఎలాంటి పత్తి పంటలకు ఎలాంటి ఫలితం ఉండదని రైతులు అంటున్నారు.

జిల్లాలో 1.66 లక్షల ఎకరాల్లో సాగు..

జిల్లావ్యాప్తంగా ఈ ఏడాది 1.66 లక్షల ఎకరాల్లో పత్తి సాగైంది. మరికల్‌, ధన్వాడ, నర్వ, మద్దూరు, కోస్గి, దామరగిద్ద, ఊట్కూర్‌, నారాయణపేట, మక్తల్‌ మండలాల్లోనే అధిక శాతం మంది రైతులు పత్తి సాగు చేశారు. ఎకరాకు రూ.30 వేల పెట్టుబడి కాగా.. వర్షాలు లేక ఇప్పటికే 75 శాతం పత్తి పంటలు ఎండలకు తట్టుకోలేక వాడుముఖం పట్టడంతో పాటు వర్షాలు లేక ఎదుగుదల లోపించింది. చెట్టుకు 5 నుంచి10 కాయలు మాత్రమే కనిపిస్తున్నాయి. ఈ పరిస్థితుల్లో ఎకరాకు ఒకటి లేదా రెండు క్వింటాళ్లకు మించి దిగుబడి వచ్చే అవకాశం కనిపించడం లేదని రైతులు చెబుతున్నారు.

వర్షాలు లేక వాడుముఖం పట్టిన పంటలు

తెగుళ్లతో సతమతం

ఎకరాకు రెండు క్వింటాళ్ల దిగుబడి రాని వైనం

ఆందోళనలో కర్షకులు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement