క్షయ రహిత జిల్లాగా తీర్చిదిద్దాలి | - | Sakshi
Sakshi News home page

క్షయ రహిత జిల్లాగా తీర్చిదిద్దాలి

Sep 22 2026 12:36 AM | Updated on Sep 22 2026 12:36 AM

అధికారుల సమన్వయంతో టీబీ ముక్త్‌ భారత్‌’ అమలు

కలెక్టర్‌ సీహెచ్‌ ప్రియాంక

నారాయణపేట: క్షయ లక్షణాలున్న ప్రతి ఒక్కరిని గుర్తించి సకాలంలో వైద్య పరీక్షలు నిర్వహించాలని, వ్యాధి నిర్ధారణ అయిన వారికి పూర్తిస్థాయి వైద్యం అందించి క్షయ రహిత జిల్లాగా తీర్చిదిద్దాలని కలెక్టర్‌ ప్రియాంక అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్‌లోని వీడియో కాన్ఫరెన్‌న్స్‌ హాల్‌లో ‘టీబీ ముక్త్‌ భారత్‌ అభియాన్‌ అమలుపై సంబంధిత శాఖల అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. క్షయను ప్రారంభ దశలోనే గుర్తించి చికిత్స అందించడంతో వ్యాప్తిని సమర్థంగా అరికట్టవచ్చన్నారు. ఆయుష్మాన్‌ భారత్‌ ఆధ్వర్యంలో పీహెచ్‌సీలు, ఎంపీహెచ్‌సీలు, ప్రభుత్వ ఆస్పత్రులు, వైద్య కళాశాలల్లో వ్యాధి నిర్ధారణ పరీక్షలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. మండలస్థాయిలోనూ స్క్రీనింగ్‌ను విస్తృతం చేయాలని ఆదేశించారు. జిల్లాలో ఇప్పటి వరకు 54,684 మందికి ఛాతీ పరీక్షలు, ఎక్స్‌రే స్క్రీనింగ్‌ నిర్వహించినట్లు వెల్లడించారు. జిల్లాలో వంద శాతం స్క్రీనింగ్‌ పూర్తి చేసి వ్యాప్తిని అరికట్టేందుకు సమగ్ర చర్యలు చేపట్టాలన్నారు. ప్రతి మండలంలో అవసరమైన సంఖ్యలో వాలంటీర్లను నియమించి ప్రజలకు వ్యాధిపై అవగాహన కల్పించాలని సూచించారు. సమావేశంలో జిల్లా వైద్యాధికారి డా. చంద్రమోహన్‌, జిల్లా టీబీ అధికారి, డీవైఎస్‌ఓ, డీఈఓ, డీపీఓ, జిల్లా కార్మికశాఖ అధికారి తదితరులు పాల్గొన్నారు.

భూ సేకరణ పూర్తి చేస్తాం..

జిల్లాలోని నీటిపారుదల ప్రాజెక్టుల భూ సేకరణ, పరిహారం చెల్లింపులు, ఇతర పనులను నిర్ణీత గడువులో పూర్తి చేసేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు కలెక్టర్‌ సీహెచ్‌ ప్రియాంక తెలిపారు. సోమవారం హైదరాబాద్‌ నుంచి రాష్ట్ర నీటిపారుదలశాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి హైదరాబాద్‌ నుంచి అన్ని జిల్లాల కలెక్టర్లతో వీడియో కాన్ఫరెనన్స్‌ నిర్వహించగా.. జిల్లా నుంచి కలెక్టర్‌ పాల్గొని వివరాలు వెల్లడించారు. వీసీలో రెవెన్యూ అదనపు కలెక్టర్‌ శ్రీను, సంబంధిత శాఖల అధికారులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement