బాధితులకు సత్వర సేవలు అందాలి | - | Sakshi
Sakshi News home page

బాధితులకు సత్వర సేవలు అందాలి

Sep 16 2026 4:37 AM | Updated on Sep 16 2026 4:37 AM

నేడు జిల్లాకు

ఎస్సీ, ఎస్టీ కమిషన్‌ చైర్మన్‌

నారాయణపేట: బాధితులకు అవసరమైన సేవలు సత్వరం, సమర్థవంతంగా అందించేందుకు నిర్వహణను మరింత మెరుగుపర్చాలని కలెక్టర్‌ సీహెచ్‌ ప్రియాంక కోరారు. మంగళవారం జిల్లాకేంద్రం సమీపంలోని ఎరగ్రుట్ట వద్ద ఉన్న సఖి కేంద్రాన్ని ఆమె ఆకస్మికంగా తనిఖీ చేసి షెల్టర్‌ గది, కౌన్సిలింగ్‌ గది, సమావేశ మందిరంతో పాటు పై అంతస్తులో నిర్వహిస్తున్న షీ టీం విభాగాన్ని పరిశీలించారు. జిల్లా మహిళా, శిశు సంక్షేమశాఖ అధికారి రాజేందర్‌గౌడ్‌తో కలిసి సిబ్బందితో మాట్లాడి కేంద్రం నిర్వహణ తీరును అడిగి తెలుసుకున్నారు. వివిధ రికార్డులను క్షుణ్ణంగా పరిశీలించి ఇప్పటివరకు ఎంతమంది బాధితులకు సేవలు అందించారు.. గత నెలలో ఎంతమంది సెంటర్‌ను ఆశ్రయించారనే వివరాలపై ఆరా తీశారు. వివాహాల సీజన్‌లో బాల్య వివాహాలకు సంబంధించిన కేసులు ఎక్కువగా వస్తుంటాయని సెంటర్‌ బాధ్యురాలు క్రాంతిరేఖ వివరించారు. ప్రస్తుతం విచారణలో ఉన్న కేసుల పురోగతిపై కూడా ఆరా తీశారు. బాధితులకు సఖిసెంటర్‌లోనే భోజనం అందించేలా కిచెన్‌ను ఏర్పాటు చేయాలని ఆదేశించారు. షీ టీం విభాగాన్ని ఇతర అనువైన ప్రదేశానికి తరలించే అంశంపై డీడబ్ల్యూఓతో చర్చించారు. మహబూబ్‌నగర్‌ సఖిసెంటర్‌ నిర్వాహకులతో మాట్లాడి కోస్గి బాధితులకు అక్కడే అవసరమైన ఆశ్రయం, కౌన్సిలింగ్‌, ఇతర సేవలు అందించేలా చర్యలు తీసుకోవాలని డీడబ్ల్యూఓను ఆదేశించారు. చైల్డ్‌ వెల్ఫేర్‌ కమిటీకి సంబంధించిన కేసుల సంఖ్య, గత రెండునెలల్లో నమోదైన కేసుల పూర్తి వివరాలను తనకు సమర్పించాలని.. సెంటర్‌లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు వెంటనే చర్యలు చేపట్టాలన్నారు.

తెలంగాణ రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ కమిషన్‌ చైర్మన్‌ బక్కి వెంకటయ్య బుధవారం జిల్లాలో పర్యటించనున్నారని కలెక్టర్‌ సీహెచ్‌ ప్రియాంక మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఉదయం 10 గంటలకు కలెక్టరేట్‌లో ఎస్సీ, ఎస్టీల సంక్షేమం, అభివృద్ధికి సంబంధించిన అంశాలపై అధికారులతో సమీక్ష ఉంటుందని.. ఈ సమావేశానికి జిల్లా అధికారులు, పుర కమిషనర్లు, ఆర్డీఓలు, తహసీల్దార్లు, ఎంపీడీఓలు, డీసీఓలు/ఆర్‌సీఓలు, అసిస్టెంట్‌ పబ్లిక్‌ ప్రాసిక్యూటర్‌ తదితర అధికారులు హాజరుకావాలని పేర్కొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement