వాల్‌పోస్టర్ ఆవిష్కరణ..
● రాష్ట్ర పశుసంవర్ధకశాఖ మంత్రి
వాకిటి శ్రీహరి
మక్తల్: విద్యాభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తోందని రాష్ట్ర పశుసంవర్ధకశాఖ మంత్రి వాకిటి శ్రీహరి అన్నారు. మంగళవారం మండంలోని గొల్లపల్లి శివారులో రూ.250 కోట్లతో నిర్మిస్తున్న ఇంటిగ్రేటెడ్ పాఠశాల నిర్మాణ పనులను ఆయన పరిశీలించి మాట్లాడారు. పనులు నాణ్యతగా వేగంగా పూర్తి చే యాలని అధికారులను ఆదేశించారు. నియోజకవర్గంలో రూ.1,600 కోట్ల అభివృద్ధి పనులు కొనసాగుతున్నాయని చెప్పారు. 150 పడకల ప్రభుత్వ ఆస్పత్రిని విజయదశమి నాటికి ప్రారంభిస్తామని.. పనులు వేగంగా జరుగుతున్నాయని తెలిపారు. 28 రహదారుల నిర్మాణానికి రూ.178 కోట్లు మంజూరు చేశామని.. 5,500 ఇందిరమ్మ ఇళ్లు మంజూర య్యాయన్నారు. గ్రామాల్లోని సమస్యలను తన దృష్టికి తీసుకొస్తే పరిష్కరించేందుకు కృషి చేస్తానని తెలిపారు. కార్యక్రమంలో మార్కెట్ వైస్ చైర్మన్ గణేష్‌కుమార్, పార్టీ పట్టణ అధ్యక్షుడు రవికుమార్ తదితరులు పాల్గొన్నారు.
తెలంగాణ ఉద్యమకారుల సమ్మేళనం ఈ నెల 24న పాలమూర్ యూనివర్సిటీలో నిర్వహించనుండగా.. అందుకు సంబంధించిన వాల్‌పోస్టర్‌ను మంగళవారం మంత్రి వాకిటి శ్రీహరి మక్తల్‌లోని తన క్యాంపు కార్యాలయంలో ఆవిష్కరించారు. ఉద్యమకారులకు గుర్తింపు కల్పించడంతో పాటు 250 గజాల ఇంటి స్థలం, పింఛన్, ఉద్యమకారుల కార్పొరేషన్ ఏర్పాటు చేయడంతో పాటు వారి పిల్లలకు ఉచిత విద్య, ఉద్యోగాల్లో రిజర్వేషన్, ఉద్యోగులకు ప్రమోషన్ కల్పించాలని వారు మంత్రిని కోరారు. కార్యక్రమంలో పాలమూరు యూనివర్సిటీ కమిటీ సభ్యులు రాములు, గోపాల్, అన్వర్, శివబ్రహ్మం, చంద్రకాంత్, తిరుపతి, కుర్మయ్య, అరవింద్, గంగాధర్, హరిప్రసాద్, శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు.


