ప్రాచీన జ్ఞానసంపదను పరిరక్షించాలి | - | Sakshi
Sakshi News home page

ప్రాచీన జ్ఞానసంపదను పరిరక్షించాలి

Sep 16 2026 4:37 AM | Updated on Sep 16 2026 4:37 AM

నారాయణపేట: కనుమరుగవుతున్న ప్రాచీన జ్ఞానసంపదను గుర్తించి భద్రపర్చాల్సిన బాధ్యత అధికారులపై ఉందని రెవెన్యూ అదనపు కలెక్టర్‌ శ్రీను అన్నారు. మంగళవారం జిల్లాకేంద్రంలో నిర్వహించిన జ్ఞానభారతి జిల్లాస్థాయి కమిటీ సమావేశంలో ప్రాచీన గ్రంథాల గుర్తింపు, సేకరణ, సంరక్షణ, డిజిటలైజేషన్‌న తదితర అంశాలపై చర్చించారు. జిల్లాలో వ్యక్తులు, సంస్థలు, వివిధ ప్రాంతాల్లో అందుబాటులో ఉన్న ప్రాచీన గ్రంథాలు, తాళపత్రాలు, చేతిరాతలను గుర్తించి సేకరించడంతో పాటు శాసీ్త్రయ పద్ధతుల్లో పరిరక్షించి డిజిటలైజ్‌ చేయాలని ఆదేశించారు. సేకరించిన గ్రంథాలను డిజిటలైజేషన్‌న్‌ చేసి భద్రపర్చడంతో భవిష్యత్‌ తరాలకు అందించవచ్చన్నారు. ప్రతి గ్రంథానికి సంబంధించిన పేరు, కాలం, రచయిత, లభించిన ప్రాంతం, భాష, ప్రాధాన్యత తదితర వివరాలను క్రమపద్ధతిలో నమోదు చేయాలని సూచించారు. జిల్లాలో జ్ఞానభారతి కార్యక్రమాన్ని విజయవంతంగా అమలు చేసేందుకు కమిటీ సభ్యులు చురుగ్గా పనిచేయాలని సూచించారు.

27న ప్రపంచ పర్యాటక దినోత్సవం..

ప్రపంచ పర్యాటక దినోత్సవం సందర్భంగా ఈ నెల 27న జిల్లాలోని 31 యువ టూరిజం క్లబ్‌ల ఆధ్వర్యంలో వివిధ పోటీలు, అవగాహన కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు రెవెన్యూ అదనపు కలెక్టర్‌ శ్రీను తెలిపారు. ప్రపంచ పర్యాటక దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించేందుకు అవసరమైన ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు. సమావేశంలో జిల్లాస్థాయి కమిటీ సభ్యులు, సంబంధిత శాఖల అధికారులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement