రిజర్వాయర్లే దిక్కు..! | - | Sakshi
Sakshi News home page

రిజర్వాయర్లే దిక్కు..!

Sep 3 2026 8:29 AM | Updated on Sep 3 2026 8:29 AM

నారాయణపేట: జిల్లాలో మత్స్య సంపద పెంచేందుకు ప్రభుత్వం ఉచిత చేప పిల్లల పంపిణీకీ శ్రీకారం చుట్టగా.. ఈసారి వర్షాభావ పరిస్థితులు లకా్‌ష్య్‌నికి సవాల్‌గా మారుతున్నాయి. సాధారణంగా వర్షాలతో చెరువులు నిండితే చేప పిల్లల పెంపకం, విడుదల ప్రక్రియ సులభంగా సాగుతుంది. కానీ ఆశించిన స్థాయిలో వర్షాలు లేకపోవడంతో అనేక చెరువుల్లో నీటి మట్టాలు ప్రమాద ఘంటికలు మోగిస్తున్నాయి. దీంతో ఈసారి చేప పిల్లల ఉత్పత్తికి రిజర్వాయర్లు, బ్యాక్‌వాటర్‌ ప్రాంతాలే ప్రధాన ఆధారంగా మారుతున్నాయి.

మత్స్యకారుల జీవనోపాధిపై ప్రభావం

ఒకవైపు వర్షాల కోసం రైతులు ఎదురుచూస్తుండగా.. మరోవైపు చెరువులపై ఆధారపడి జీవించే మత్స్యకార కుటుంబాల పరిస్థితి దయనీయంగా మారుతోంది. సెప్టెంబర్‌ 2 వరకు జిల్లాలోని 13 మండలాల్లో సాధారణ వర్షపాతం 376 మి.మీ.కు గాను ఇప్పటి వరకు 264.4 మి.మీ. మాత్రమే కురవగా జిల్లాలో 30 శాతం వర్షపాతం లోటు నమోదైంది. నీటి వనరులు ఆశించిన స్థాయిలో లేకపోతే చేప పిల్లల పెంపకం, ఉత్పత్తి, భవిష్యత్‌ పట్టుబడులపై ప్రభావం పడే అవకాశం ఉంది. జిల్లాలోని 641 చెరువుల్లో 1.87 కోట్ల చేప పిల్లలను విడుదల చేయాలన్న లక్ష్యం ఉండగా ఇందులో శాశ్వత నీటి వనరులు ఉన్న 68 చెరువులను గుర్తించి సుమారు 92 లక్షల చేప పిల్లలను పెంచి సరఫరా చేసేందుకు అధికారులు ప్రణాళిక రూపొందించారు.

భూత్పూర్‌లో 10 లక్షలు..

భూత్పూర్‌ రిజర్వాయర్‌లో 10 లక్షల చేప పిల్లలను పెంచే లక్ష్యం ఉంది. రిజర్వాయర్‌లో ప్రస్తుతం ఉన్న నీటి లభ్యతతో పాటు చేప పిల్లల పెంపకానికి అనువైన పరిస్థితులను అధికారులు పరిశీలిస్తున్నారు.

జూరాల బ్యాక్‌వాటర్‌పై ఆశలు

జూరాల బ్యాక్‌వాటర్‌ మత్స్యశాఖకు మరో కీలక ఆధారంగా నిలుస్తోంది. ఇక్కడ 12 లక్షల చేప పిల్లల ఉత్పత్తి లక్ష్యంగా ఉంది. వర్షాధార చెరువుల్లో నీరు తగ్గుతున్న నేపథ్యంలో బ్యాక్‌వాటర్‌ ప్రాంతాలను వినియోగించుకోవడంపై అధికారులు దృష్టి పెట్టారు.

జిల్లాలో 1.87 కోట్ల

చేప పిల్లల పెంపు లక్ష్యం

వానలు ముఖం చాటేయడంతో

చెరువుల్లో నీటి గండం

సంగంబండ, భూత్పూర్‌, జూరాల బ్యాక్‌వాటర్‌పైనే ఆశలు

80 నుంచి 100 ఎంఎం పిల్లలపై

అధికారుల ప్రత్యేక నజర్‌

దాఖలైన మూడు టెండర్లు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement