పర్యావరణ పరిరక్షణే నిజమైన విద్య | - | Sakshi
Sakshi News home page

పర్యావరణ పరిరక్షణే నిజమైన విద్య

Sep 3 2026 8:29 AM | Updated on Sep 3 2026 8:29 AM

నారాయణపేట ఎడ్యుకేషన్‌: పర్యావరణ పరిరక్షణే నిజమైన విద్య అని, నేటి పిల్లలే భూమికి నిజమైన నాయకులు కావాలని ప్రొఫెసర్‌ ఉపేందర్‌రెడ్డి, డీఈఓ గోవిందరాజులు అన్నారు. ఈ మేర కు బుధవారం మండలంలోని జాజాపూర్‌ ఉన్నత పాఠశాలలో తెలంగాణ ప్రభుత్వ పాఠశాల విద్యా శాఖ, ప్రముఖ పర్యావరణ సంస్థ కౌన్సిల్‌ ఫర్‌ గ్రీన్‌ రెవల్యూషన్‌ ఆధ్వర్యంలో నారాయణపేట జిల్లా ప్రభుత్వ పా ఠశాలకు చెందిన లీడ్‌ ఎర్త్‌ లీడర్స్‌ కోసం ఒక రోజు శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమానికి ఎస్‌ఈఆర్‌టీ రిటైర్డ్‌ ప్రొఫెసర్‌ ఉంపేదర్‌రెడ్డి, డీఈఓ గో విందరాజులు ము ఖ్య అతిథులు గా హాజరై మాట్లాడా రు. నేటి విద్యార్థు లు భూమిని నడిపించే నాయకులు గా తయారుకావాలని పిలుపునిచ్చారు. చదువు అంటే కేవలం పాఠ్య పుస్తకాలు మార్కులు తెచ్చుకోవడం కాదని మనం నివసిస్తున్న భూమిని, ప్రకృతిని కాపాడుకోవడం అన్నారు. కార్యక్రమంలో డీఎస్‌ఓ భానుప్రకాష్‌, ఏఎంఓ విద్యాసాగర్‌, సెక్టోరియల్‌ అధికారి నాగార్జున్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement