ఎకై ్సజ్‌ శాఖలో భారీగా బదిలీలు | - | Sakshi
Sakshi News home page

ఎకై ్సజ్‌ శాఖలో భారీగా బదిలీలు

Sep 3 2026 8:29 AM | Updated on Sep 3 2026 8:29 AM

నారాయణపేట: తెలంగాణ ప్రొహిబిషన్‌ అండ్‌ ఎక్సైజ్‌ శాఖలో భారీస్థాయిలో బదిలీలు చోటుచేసుకున్నాయి. సీఐ, ఎస్‌ఐ కేడర్‌ అధికారులకు స్థానచలనం కల్పిస్తూ బుధవారం సాయంత్రం నుంచి వరుసగా ఉత్తర్వులు జారీ అయ్యాయి. ప్రొహిబిషన్‌ అండ్‌ ఎకై ్సజ్‌ కమిషనర్‌ ఆమోదంతో గ్రేటర్‌ హైదరాబాద్‌ ఎకై ్సజ్‌ డిప్యూటీ కమిషనర్‌ (ఇన్‌చార్జి) హరికృష్ణ ప్రొసీడింగ్స్‌ జారీ చేశారు. బదిలీ అయిన అధికారులు ప్రస్తుత పోస్టు నుంచి వెంటనే రిలీవ్‌ అయి, కొత్తగా కేటాయించిన స్థానాల్లో తక్షణమే విధుల్లో చేరాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.

● ఉమ్మడి మహబూబ్‌నగర్‌ జిల్లా ఎకై ్సజ్‌ పరిధిలోనూ పలువురు అధికారులకు స్థానచలనం కలిగింది. నారాయణపేట ఎకై ్సజ్‌ సీఐ అనంతయ్య శేరిలింగంపల్లికి బదిలీ అయ్యారు. ఆయన స్థానంలో నల్లగొండ డీటీఎఫ్‌ సీఐ సైదులు వస్తున్నారు.

● నారాయణపేట ఎకై ్సజ్‌ సర్కిల్‌ ఎస్‌ఐలు గురువయ్య దేవరకొండకు,రమేష్‌ కోదాడ చెక్‌పోస్టు, శిరీష తుంగతుర్తికి బదిలీ అయ్యారు. కోస్గి సీఐ బా లకృష్ణ మల్కాజ్‌గిరికి బదిలీ కాగా..నారా యణ పేట బీఎంపీపీలో పనిచేస్తున్న శ్రావణ్‌కుమార్‌ సైబరాబాద్‌ పరిధిలోని పటాన్‌చెరువుకు బదిలీ అయ్యారు.

ఉమ్మడి జిల్లాలో మరికొందరికి..

మహబూబ్‌నగర్‌ సీఐ లక్ష్మణ్‌గౌడ్‌ కుత్బుల్లాపూర్‌కు, జడ్చర్ల సీఐ విప్లవ్‌రెడ్డి దూల్‌పేట్‌కు బదిలీ అయ్యారు. నాగర్‌కర్నూల్‌ పరిధిలోని ఎస్‌ఐ చిన్నరాములు మోటూరి హుజూర్‌నగర్‌కు, జడ్చర్ల ఎస్‌ఐ నాగరాజు ఎన్‌ఫోర్స్‌మెంట్‌ మల్కాజ్‌గిరికి, కోస్గి ఎస్‌ఐ ఎంఏ జబ్బార్‌ హయత్‌నగర్‌, డీటీఎఫ్‌ నుంచి కవిత సంగారెడ్డికి బదిలీ అయ్యారు.

● రేవులపల్లి నుంచి జి.వెంకటేశం మహబూబ్‌నగర్‌ సీఐగా, జహీరాబాద్‌ నుంచి మల్లికార్జునబాబు వనపర్తి సీఐగా, ఎన్‌ఫోర్స్‌మెంట్‌ నుంచి చంద్రశేఖర్‌ జడ్చర్ల సీఐగా బదిలీపై వస్తున్నారు. మెదక్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ నుంచి ఎస్‌ఐ యాదయ్య జడ్చర్లకు, రామపేట్‌ నుంచి ఎస్‌ఐ శివకృష్ణ చెక్‌పోస్టు కు, హయత్‌నగర్‌ నుంచి ఎస్‌ఐ సరళ కోస్గికి బదిలీ వస్తున్నారు. ఘనపూర్‌ నుంచి నరేష్‌ కేతావత్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ మహబూబ్‌నగర్‌కు బదిలీపై వస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement