కొత్తపల్లి: మద్దూరు మండల కేంద్రంలో ఈ నెల 4న ముఖ్యమంత్రి పర్యటన నేపథ్యంలో భద్రతా ఏర్పాట్లను పోలీసులు కట్టుదిట్టం చేశారు. డిగ్రీ కాలేజీ భవనం, సాంఘీక గురుకుల పాఠశాల, కళాశాల భవనాల వద్ద ముందస్తుగా తనిఖీలు నిర్వహించారు. హెలీప్యాడ్ ప్రాంతాల్లో బాంబ్ డిస్పోజల్ స్క్వాడ్, డాగ్ స్క్వాడ్ సిబ్బంది విస్తృతంగా తనిఖీలు చేపట్టారు. సీఎం పర్యటించే ప్రాంతాల్లో మెటల్ డిటెక్టర్లు, అత్యాధునిక స్కానర్లుతో అణువణువూ పరిశీలిస్తున్నారు. అనుమానాస్పద వ్యక్తులు కనిపిస్తే తక్షణమే పోలీసులకు సమాచారం అందించాలని ఎస్‌ఐ విజయ్‌కుమార్ ఆదేశాలు జారీ చేశారు.


