మక్తల్: పట్టణంలోని శ్రీ పడమటి ఆంజనేయస్వామి ఆలయ హుండీ లెక్కింపును సోమవారం ఆలయంలో నారాయణపేట డివిజన్ పరిశీలకుడు శ్రీనివాస్, ఆలయ చైర్మన్ ప్రాణేష్‌చారి ఆధ్వర్యంలో నిర్వహించారు. జనవరి నుంచి ఆగస్టు వరకు మొత్తం రూ.8,80,186 సమకూరినట్లు ఈఓ నిత్యానందం తెలిపారు. అంతకుముందు ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. సిబ్బంది అరవింద్, శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు.
ఇన్‌స్పైర్ అవార్డులకు దరఖాస్తుల ఆహ్వానం
నారాయణపేట ఎడ్యుకేషన్: ఇన్‌స్పైర్ అవార్డుల దరఖాస్తునకు సెప్టెంబర్ 15 వరకు గడు వు ఉందని.. జిల్లాలోని ప్రతి పాఠశాల నుంచి కనీసం ఐదు నామినేషన్లు నమోదు చేసి జిల్లాను రాష్ట్రంలో ప్రథమ స్థానంలో నిలపాల ని డీఈఓ గోవిందరాజు కోరారు. సోమవారం జిల్లాకేంద్రంలోని టీఎస్‌డబ్ల్యూఎస్ జూనియర్ కళాశాలలో నిర్వహించిన ప్రధానోపాధ్యాయు ల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఇన్‌స్పైర్ అవార్డ్స్ 2026–27 గురించి జిల్లా సైన్స్ అధికారి అవగాహన కల్పించారు. జిల్లాలోని యాజమాన్య, యూపీఎస్, హైస్కూల్స్ పాలొ ్గనవచ్చని.. సంబంధిత వెబ్‌సైట్‌లో పూర్తి వివరాలు నమోదు చేయాలన్నారు. 6వ తరగతి నుంచి 12వ తరగతి వరకు విద్యార్థులు నామినేషన్ చేసుకోవచ్చని.. ప్రదర్శించాలనుకున్న ప్రాజెక్ట్‌ను క్లుప్తంగా నమోదు చేయాలన్నారు. ఈ అవార్డులు జిల్లా, రాష్ట్ర, జాతీయ స్థాయిలో ఉంటాయని.. జాతీయస్థాయికి ఎంపికై న అవార్డు విద్యార్థుల ఖాతాలో రూ.10 వేలు జమ అవుతాయని తెలిపారు. మరిన్ని వివరాలకు www.inspireawards-dst.gov.in
వెబ్‌సైట్‌ను లేదా జిల్లా సైన్స్ అధికారి భానుప్రకాశ్ (సెల్‌నంబర్ 94401 67947) సంప్రదించాలని సూచించారు. కార్యక్రమంలో ఏఎంఓ విద్యాసాగర్, వివిధ పాఠశాలల ప్రధానోపాధ్యాయులు పాల్గొన్నారు.
క్రీడలతో
మానసిక ఉల్లాసం
మహబూబ్‌నగర్ ఎడ్యుకేషన్: టీచర్స్ డేను పురస్కరించుకుని పాలమూరు యూనివర్సిటీలో టీచింగ్, నాన్‌టీచింగ్ సిబ్బందికి క్రీడా పోటీలు నిర్వహించారు. పీయూ వీసీ శ్రీనివాస్ క్రీడలను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయ న మాట్లాడుతూ సిబ్బంది క్రీడల్లో పాల్గొనడం వల్ల మానసిక ఉల్లాసంతో పాటు శారీరక ఆరో గ్యం మెరుగుపడుతుందన్నారు. రిజిస్ట్రార్ రమే ష్‌బాబు, ఓఎస్డీ మధుసూదన్‌రెడ్డి, ఆడిట్‌సెల్ డైరెక్టర్ చంద్రకిరణ్, పీడీ శ్రీనివాస్ పాల్గొన్నారు.


