కొత్తపల్లి: హామీల అమలుకు పోరాట లక్ష్యంతో ముందుకు సాగాలని పీఆర్టీయూ టీఎస్ జిల్లా అధ్యక్షుడు జనార్దన్‌రెడ్డి, ప్రధానకార్యదర్శి వెంకట్‌రెడ్డి పిలుపునిచ్చారు. ఆదివారం మద్దూరు జెడ్పీ బాలికల ఉన్నత పాఠశాలలో నిర్వహించిన సన్నాహక సమావేశంలో వారు పాల్గొని మాట్లాడారు. రెండో పీఆర్సీని 51 శాతం ఫిట్‌మెంట్‌తో, పెండింగ్‌లో ఉన్న ఆరు డీఏలను ప్రకటించాలని, మేనిఫెస్టోలో ప్రకటించిన మాటకు కట్టుబడి సీపీఎస్‌ను రద్దుచేసి పాత పింఛన్ విధానాన్ని పునరుద్ధరించాలని కోరారు. అదేవిధంగా గత ప్రభుత్వం తీసుకొచ్చిన జీఓనంబర్ 317 ద్వారా ఇబ్బందులు పడుతున్న వారి సమస్యలు పరిష్కరించాలని.. ఉద్యోగుల ఆరోగ్య పథకాన్ని పకడ్బందీగా అమలు చేయాలన్నారు. హామీల అమలుకై ప్రభుత్వం మీద ఒత్తిడి పెంచేందుకు నిర్వహించే మహాధర్నాలో ఉపాధ్యాయులు అధికసంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో సంఘం జిల్లా మాజీ అధ్యక్షుడు నర్సింహారెడ్డి, మద్దూరు మండల అధ్యక్షుడు భాస్కర్, ప్రధానకార్యదర్శి సూర్యప్రకాష్, వివిధ మండలాల ఉపాధ్యాయ సంఘం నాయకులు పాల్గొన్నారు.
‘చేనేత’ ధర్నాను
విజయవంతం చేయాలి
నారాయణపేట ఎడ్యుకేషన్: చేనేత కార్మికుల సమస్యల పరిష్కారం కోసం సెప్టెంబర్ 9న జిల్లా కలెక్టరేట్ ఎదుట చేపట్టే ధర్నాకు నేతన్నలు అధికసంఖ్యలో తరలివచ్చి విజయవంతం చేయాలని సీఐటీయూ జిల్లా కార్యదర్శి బండమీది బలరాం పిలుపునిచ్చారు. ఆదివారం జిల్లాకేంద్రంలోని బురిడివాడలో అఖిలపక్షం ఆధ్వర్యంలో చేనేత కార్మికులను కలిసి మాట్లాడారు. పట్టణంలోని చేనేత కార్మికులకు గత ప్రభుత్వం మగ్గాలిచ్చి ముడి సరుకు సరఫరా చేయకపోవడంతో మూలకు పడ్డాయని.. కార్మికులకు సొసైటీలో సభ్యత్వం కల్పించి నేతన్న బీమా పథకం అమలు చేయాలన్నారు. ముడి సరుకు బయటి మార్కెట్‌లో కొనుగోలు చేయడానికి బ్యాంకుల ద్వారా కనీసం రుణాలు కూడా ఇవ్వలేదని ఆవేదన వ్యక్తం చేశారు. సొంత ఇల్లు లేక ఫించన్ అందక చేనేత సొసైటీతో తమకు ఎలాంటి లాభం లేక అనేక ఇబ్బందులకు గురవుతున్నారన్నారు. సొసైటీల్లో 2009 నుంచి 2026 వరకు రూ.51 కోట్ల అక్రమ లావాదేవీలు జరిపారని.. పూర్తిస్థాయిలో విచారణ జరపాలని కోరారు. కార్యక్రమంలో చేనేత కార్మిక సంఘం సీనియర్ నాయకుడు నారాయణ, బీఎస్పీ నారాయణపేట నియోజకవర్గం ఇన్‌చార్జ్ అశోక్, సీపీఎం నాయకులు కాశప్ప, నరహరి, సోఫీ, జనసేన జిల్లా నాయకుడు విష్ణువర్ధన్ తదితరులు పాల్గొన్నారు.
కొనసాగుతున్న
ఆరాధనోత్సవాలు
నారాయణపేట: జిల్లాకేంద్రంలోని శ్రీ రాఘవేంద్రస్వామి ఆలయంలో ఆరాధనోత్సవాలు వైభవంగా కొనసాగుతున్నా యి. రెండోరోజు ఆదివారం మ ధ్యారాధన సందర్భంగా తెల్లవారుజామున సుప్రభాత సేవ, అనంతరం స్వామివారికి పంచామృతాభిషేకం నిర్వహించారు. ప్రత్యేక పూజ ల్లో అర్చకుల వేద్రమంత్రోచ్ఛారణలతో ఆల యం మార్మోగింది. పుష్పాలంకరణలో దర్శనమిచ్చిన రాఘవేంద్రస్వామిని చూసేందుకు భక్తులు పోటెత్తారు. హరిదాసుల భక్తి సంకీర్తనల మధ్య గోపాల కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా వినాయక, అనంతశయన, ఆంజనేయస్వామి ఆలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించారు. విద్వాన్ అనిల్ దేశాయి ఆధ్యాత్మిక ప్రవచనం చేశారు. ప్రతి ఒక్కరూ దైవచింతనతో సన్మార్గంలో నడుస్తూ సత్ప్రవర్తనతో జీవించాలని పిలుపునిచ్చారు.కార్యక్రమంలో ఆలయ అర్చకులు నర్సింహచారి, శక్తిపీఠం స్వామి శాంతానంద పురోహిత్, రాఘవేంద్ర సేవాసమితి సభ్యులు రఘుప్రేమ్, భీంసేన్‌రావు, నర్సింహ, శేషు, ఆనందరావు, మంజునాథ్ జోషి, సీతారామరావు పాల్గొన్నారు.


