ఆర్థికంగా వెనకబడ్డ మాలాంటి పేద విద్యార్థులకు స్కాలర్‌షిప్ ఎంతగానో ఉపయోగపడుతోంది. ఉపాధ్యాయుల సహకారంతో చక్కగా చదివి ఎన్‌ఎంఎంఎస్ ఉత్తీర్ణత సాధించా. ఏటా ప్రభుత్వం ఇచ్చే పారితోషికం నా చదువుకు ఎంతగానో ఉపయోగపడుతుంది. తోటి మిత్రులు ఈ సదావకాశాన్ని వినియోగించుకొని స్కాలర్‌షిప్ అందుకోవాలని కోరుకుంటున్నా.
– అజయ్, కోటకొండ పీఎంశ్రీ స్కూల్
విద్యార్థులు ఈ సదావకాశాన్ని వినియోగించుకొని దరఖాస్తు చేసుకోవాలి. పేద, మధ్యతరగతి కుటుంబాలకు ఈ ఉపకార వేతనం ఎంతో అవసరం. ప్రణాళికతో చదివితే విజయం సాధించవచ్చు. గతంలో కంటే ఈ ఏడాది ఎక్కువ సంఖ్యలో విద్యార్థులు ఎంపికయ్యేటట్లు కృషి చేస్తాం.
– డా. గోవిందరాజు, జిల్లా విద్యాధికారి


