బాధితులకు సత్వర న్యాయమే లక్ష్యం : ఎస్పీ | - | Sakshi
Sakshi News home page

బాధితులకు సత్వర న్యాయమే లక్ష్యం : ఎస్పీ

Aug 30 2026 1:27 AM | Updated on Aug 30 2026 1:27 AM

నారాయణపేట: బాధితులకు సత్వర న్యాయం అందించడమే లక్ష్యంగా పని చేయాలని, పోలీస్‌స్టేషన్‌కు రాలేని పరిస్థితుల్లో ఉన్న బాధితుల వద్దకే వెళ్లి ఫిర్యాదులు స్వీకరించి, అవసరమైన సందర్భాల్లో సంఘటనా స్థలంలోనే ఆన్‌సైట్‌ ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేసి చట్టపరమైన చర్యలు చేపట్టాలని ఎస్పీ వినీత్‌ పోలీసు అధికారులను ఆదేశించారు. శనివారం జిల్లాపరిధిలోని పోలీసు అధికారులతో టెలి కాన్ఫరెనన్స్‌ నిర్వహించి మాట్లాడారు. బాధితుల పట్ల బాధ్యతాయుతంగా, మానవీయ కోణంతో వ్యవహరించాలని సూచించారు. ప్రజలు తమ సమస్యలు, ఇబ్బందులు, నేరాలకు సంబంధించిన ఫిర్యాదులుంటే స్థానిక పోలీసులకు సమాచారం అందించాలని.. వెంటనే పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని పరిస్థితులను పరిశీలించాలని, అవసరాన్ని బట్టి అక్కడికక్కడే ఫిర్యాదు నమోదు చేసి తగిన చర్యలు చేపట్టాలని స్పష్టం చేశారు. ముఖ్యంగా వృద్ధులు, మహిళలు, దివ్యాంగులు, అనారోగ్యంతో బాధపడుతున్న వారు, గాయపడిన బాధితులు, చిన్నారులు, మైనర్లు, అత్యవసర పరిస్థితుల్లో ఉన్నవారు, దూరప్రాంతాల్లో నివసించే బాధితులకు ప్రత్యేక ప్రాధాన్యం ఇవ్వాలని ఆదేశించారు. బాధితులు పోలీస్‌స్టేషన్‌ చుట్టూ తిరగాల్సిన పరిస్థితి రాకుండా, అవసరమైన సేవలను వారి వద్దకే తీసుకెళ్లేలా పనిచేయాలని సూచించారు. ప్రతి ఫిర్యాదుపై తక్షణమే స్పందించి బాధితుల భద్రత, గౌరవం, గోప్యతకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలన్నారు. ప్రజలకు పోలీసుశాఖపై మరింత విశ్వాసం పెరిగేలా ప్రతి అధికారి, సిబ్బంది బాధ్యతాయుతంగా విధులు నిర్వహించాలని ఆదేశించారు.

నేడు విద్యుత్‌ సరఫరా

నిలిపివేత

నారాయణపేట ఎడ్యుకేషన్‌: రానున్న వినాయక చవితిని పురస్కరించుకొని జిల్లాకేంద్రంలో నిరంతర విద్యుత్‌ సరఫరా కోసం ముందస్తు చర్యల్లో భాగంగా ఆదివారం చిన్న పిల్లల ఆస్పత్రి ఫీడర్‌, సివిల్‌–1 ఫీడర్‌ మరమ్మతులు చేపడుతున్నామని ఏఈ మహేష్‌గౌడ్‌ శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. పనుల కారణంగా ఆదివారం ఉదయం 7 నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు విద్యుత్‌ సరఫరా ఉండదని.. విద్యుత్‌ వినియోగదారులు, వ్యాపారులు అంతరాయానికి సహకరించాలని పేర్కొన్నారు.

ఓబీసీ కమిటీల పునర్నిర్మాణానికి దరఖాస్తులు

నారాయణపేట: డీసీసీ అధ్యక్షుడు కె.ప్రశాంత్‌కుమార్‌ ఆధ్వర్యంలో ఓబీసీ కమిటీల పునర్నిర్మాణ ప్రక్రియకు శ్రీకారం చుట్టారు. శనివారం డీసీసీ కార్యాలయం సీవీఆర్‌ భవన్‌లో జిల్లా ఓబీసీ చైర్మన్‌ గొల్ల కృష్ణయ్య ఆధ్వర్యంలో దరఖాస్తులు, అర్హులైన నాయకుల పేర్ల స్వీకరణ కార్యక్రమం నిర్వహించారు. టీపీసీసీ పరిశీలకుడు కోట్ల చంద్రయ్య ముఖ్యఅతిథిగా హాజరై ఓబీసీ కమిటీల ఏర్పాటు, సంస్థాగత నిర్మాణంపై నాయకులకు పలు సూచనలు చేశారు. జిల్లా ఓబీసీ చైర్మన్‌ పదవితో పాటు మండల ఓబీసీ అధ్యక్షుల నియామకాలకు దరఖాస్తులు స్వీకరించారు. అలాగే టౌన్‌ ఓబీసీ అధ్యక్షులు, టౌన్‌ కమిటీలు, మండల, గ్రామస్థాయి ఓబీసీ కమిటీల ఏర్పాటు, అసెంబ్లీ నియోజకవర్గ స్థాయి ఓబీసీ కమిటీల పునర్నిర్మాణానికి సంబంధించిన ప్రతిపాదనలు తీసుకున్నారు. జిల్లా, రాష్ట్రస్థాయి కమిటీలో నియమించాల్సిన అర్హులైన నాయకుల పేర్లను కూడా స్వీకరించారు. ఓబీసీ వర్గాలను కాంగ్రెస్‌పార్టీతో మరింత సన్నిహితంగా అనుసంధానం చేస్తూ గ్రామస్థాయి నుంచి పార్టీని పటిష్టం చేయడమే ఈ కార్యక్రమం ప్రధాన లక్ష్యమని నాయకులు పేర్కొన్నారు.

మైనార్టీ యువతకు ఉచిత శిక్షణ

నారాయణపేట: రాష్ట్రంలోని మైనార్టీ నిరుద్యోగ యువత పోటీ పరీక్షలకు సిద్ధమయ్యేందుకు రాష్ట్ర మైనార్టీ స్టడీసర్కిల్‌, మైనార్టీ సంక్షేమశాఖ ఆధ్వర్యంలో ఉచిత టీజీపీఎస్‌సీ ఫౌండేషన్‌ కోచింగ్‌ ఇస్తున్నట్లు జిల్లా మైనార్టీ సంక్షేమశాఖ అధికారి ఎంఏ రషీద్‌ శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. ముస్లింలు, క్రిస్టియన్లు, సిక్కులు, బౌద్ధులు, పార్సీలు, జైనులు తదితర మైనార్టీ వర్గాలు, బీపీఎల్‌ కేటగిరీలో ఉన్న అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు పేర్కొన్నారు. గ్రాడ్యుయేషన్‌ పూర్తి చేసి బీపీఎల్‌ కేటగిరీకి చెందిన వారు అర్హులని.. అర్హత, ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఒరిజినల్‌ వి ద్యార్హత ధ్రువపత్రాలు, ఆధార్‌కార్డు, పాస్‌ పోర్ట్‌ సైజుఫొటోతో సెప్టెంబర్‌ 1 నుంచి సెప్టెంబర్‌ 14 వరకు దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపా రు. ఎంపికై న అభ్యర్థులకు సెప్టెంబర్‌ 15 నుంచి తెలంగాణ రాష్ట్ర మైనార్టీ స్టడీసర్కిల్‌, ఇంది రా ప్రియదర్శిని కళాశాల, ఎంఏఎం క్యాంపస్‌, నాంపల్లి, హైదరాబాద్‌లో శిక్షణా తరగతులు ప్రారంభం కానున్నాయని వెల్లడించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement