మరికల్: డీసీఎస్‌లో పంట వివరాలను కచ్చితంగా నమోదు చేయాలని.. ఈ విషయంలో అధికారులు ఎలాంటి జాప్యం చేయకూడదని జిల్లా వ్యవసాయ అధికారి సక్రియానాయక్ ఆదేశించారు. శనివారం మండలంలోని తీలేర్, మరికల్‌లో కొనసాగుతున్న పంట వివరాల నమోదు ప్రక్రియను క్షేత్రస్థాయిలో ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. పంటల బుకింగ్ సమయంలో రైతులు సాగు చేసిన పంటలను సరిచూసుకోవాలని సూచించారు. అనంతరం మండల కేంద్రంలోని ఫర్టిలైజర్ దుకాణాలను తనిఖీ చేశారు. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ఎఫ్‌ఎఫ్‌ఎస్ యాప్ ద్వారా రైతులు ఎరువుల బుకింగ్ విధానంపై ఆరా తీశారు. రైతులు అవసరానికి మించి ఎరువులను వినియోగించొద్దని.. భూసార పరీక్షలు నిర్వహించి అందుకు అనుగుణంగా సమతుల ఎరువులను వినియోగించాలని కోరారు. ఆయన వెంట ఏఓ రహమాన్, ఏఈఓ వహీదా బేగం తదతరులు ఉన్నారు.
శనేశ్వరుడికి
ప్రత్యేక పూజలు
కందనూలు: నందివడ్డేమాన్ జ్యేష్ఠాదేవి సమేత శనేశ్వరుడికి శనివారం ప్రత్యేక పూజలు చేశారు. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులు తమ శనిదోష నివారణార్థం ఆలయ ప్రధాన అర్చకులు గవ్వమఠం విశ్వనాథ శాసీ్త్ర వేద మంత్రోచ్ఛరణల మధ్య శనేశ్వరుడికి తిల, తైలాభిషేకాలు నిర్వహించారు. ప్రతి ఒక్కరు జన్మరీత్యా, గోచార రీత్యా శనిగ్రహ దోష నివారణకు స్వామివారిని శక్తిమేరకు పూజించాలని ఆయన సూచించారు. కార్యక్రమంలో ఆలయ చైర్మన్ వెల్దండ గోపాల్‌రావు, సర్పంచ్ సుగుణమ్మ పాల్గొన్నారు.


