మక్తల్: గ్రామాల అభివృద్ధికి ప్రాధాన్యం ఇవ్వాలని రాష్ట్ర పశుసంవర్ధకశాఖ మంత్రి వాకిటి శ్రీహరి అన్నారు. శనివారం నియోజకవర్గ కేంద్రంలోని క్యాంపు కార్యాలయంలో ఎస్‌ఐఆర్‌పై ప్రత్యేక సమావేశం నిర్వహించి అందుకు సంబంధించిన వివరాలను పార్టీ నాయకులను అడిగి తెలుసుకున్నారు. గ్రామాల్లో ఓటర్ల పేర్లు తప్పులు లేకుండా చూడాలని.. ఇంటింటికి వెళ్లి ఆన్‌లైన్‌లో నమోదు చేయాలన్నారు. తాగునీటి ఎద్దడి, విద్య, వైద్యం, ప్రజలకు ఇబ్బందులు లేకుండా తగిన చర్యలు తీసుకోవాలని కోరారు. ఏమైనా సమస్యలు ఉంటే తన దృష్టికి తీసుకురావాలని సూచించారు. బీఎల్వోలకు బీఎల్‌ఏలు సహకరించాలన్నారు. కార్యక్రమంలో మార్కెట్ వైస్ చైర్మన్ గణేష్‌కుమార్, జిల్లా కోశాధికారి ఆనంద్‌గౌడ్, మాగనూర్ మండల కాంగ్రెస్ అధ్యక్షుడు శివరాంరెడ్డి, శ్రీనివాస్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.


