ధన్వాడ మండలం ఆకుమర్రితండాకు చెందిన కె.గీత ఏడేళ్లుగా రెజ్లింగ్‌లో సాధన చేస్తోంది. ప్రస్తుతం డిగ్రీ ప్రథమ సంవత్సరం చదువుతోంది. ఇప్పటికే పలు జాతీయస్థాయి పోటీల్లో పాల్గొని తన ప్రతిభను నిరూపించుకుంది. 2023లో ఉత్తరప్రదేశ్‌లో జరిగిన సబ్ జూనియర్ నేషనల్స్, 2024లో ఉత్తరాఖండ్‌లో జరిగిన సీనియర్ నేషనల్స్, మధ్యప్రదేశ్‌లోని సబ్ జూనియర్ నేషనల్స్‌తో పాటు 2025లో రాజస్థాన్‌లో జరిగిన అండర్–20 నేషనల్స్, ఉత్తరప్రదేశ్‌లో జరిగిన జాతీయ పోటీల్లో బరిలోకి దిగింది. ఈ ఏడాది హర్యానాలో జరిగిన ఖేలో ఇండియా నేషనల్ రెజ్లింగ్‌లో 50 కేజీల విభాగంలో రజత పతకం, అండర్–23 సీనియర్ నేషనల్ చాంపియన్‌షిప్‌లో 53 కేజీల విభాగంలో కాంస్య పతకం సాధించింది. ఈ నెల 31న న్యూఢిల్లీలోని ఐజీ స్టేడియంలో జరిగే అండర్–23 వరల్డ్ చాంపియన్‌షిప్ ట్రయల్స్‌కు ఎంపికై ంది. అంతర్జాతీయ వేదికపై దేశానికి ప్రాతినిధ్యం వహించడమే తన తదుపరి లక్ష్యమని గీత చెబుతోంది.


