జిల్లాలో పంటల సాగు వివరాలు
పకడ్భందీగా సర్వే..
–9లో u
నర్వ: జిల్లాలో వానాకాలం పంటల సాగు వివరాల నమోదు ప్రక్రియ ఇటీవల ప్రారంభమైంది. జిల్లావ్యాప్తంగా 4 లక్షల ఎకరాల్లో వివిధ రకాల పంటలు సాగవుతున్నట్లు వ్యవసాయశాఖ అధికారులు అంచనా వేశారు. వ్యవసాయశాఖ సిబ్బంది క్షేత్రస్థాయిలో పర్యటించి వివరాలు సేకరించడంతో అసలైన రైతులు మాత్రమే పంట ఉత్పత్తులను ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల్లో మద్దతు ధరకు విక్రయించుకునే అవకాశం ఉంటుంది. ఇదిలా ఉండగా ఈ ఏడాది ఎల్‌నినో ప్రభావంతో తీవ్ర వర్షాభావ పరిస్థితులు నెలకొని రైతులు పంటల సాగును కాస్త అటు ఇటు చేసుకోవడంతో పంట వివరాల నమోదు ప్రక్రియ గతేడాది కంటే రెండు నెలలు ఆలస్యంగా ప్రారంభమైంది.
క్షేత్రస్థాయిలో పర్యటించి.. రైతులు తాము పండించిన పంట ఉత్పత్తులను ప్రభుత్వ విక్రయ కేంద్రాల్లో విక్రయించాలంటే వ్యవసాయశాఖ అధికారులు వివరాలను ఆన్‌లైన్‌లో నమోదు చేసుకోవాలి. వ్యవసాయశాఖ అధికారులు గ్రామాల్లో పర్యటించి రైతులు ఏయే పంటలు ఎంత విస్తీర్ణంలో వేశారనే విషయాలు సేకరించి లొకేషన్‌తో పాటు పంట ఫొటోలను అప్‌లోడ్ చేయాలి. వీటి ఆధారంగా దిగుబడులను వ్యవసాయ, మార్కెటింగ్ శాఖల అధికారులు అంచనా వేసి కొనుగోళ్లకు అవసరమైన చర్యలు తీసుకుంటారు. పంట వివరాలు నమోదు చేసుకొన్న రైతులు మాత్రమే పత్తి, కంది, మొక్క జొన్న, సోయాబిన్ తదితర పంటలను ప్రభుత్వ విక్రయ కేంద్రాల్లో మద్దతు ధరకు విక్రయించుకునే అవకాశం ఉంది. మార్కెట్‌యార్డులో ఏర్పాటు చేసిన మార్క్‌ఫెడ్, సీసీఐ కేంద్రాలకు రైతులు పంట ఉత్పత్తులను అమ్మకానికి తీసుకొచ్చినప్పుడు మార్కెటింగ్ సిబ్బంది ఆన్‌లైన్‌లో పొందుపర్చిన వివరాలు ఉంటేనే కొనుగోళ్లు చేపడతారు.
సీజన్ ప్రారంభమై రెండు నెలలైనా..
వానాకాలం సీజన్ ప్రారంభమైన రెండు నెలలకు వ్యవసాయశాఖ అధికారులు క్రాప్ బుకింగ్ ప్రక్రియను ప్రారంభించారు. గతేడాది కూడా పంట వివరాల నమోదులో జాప్యం కారణంగా పత్తి తదితర పంటల కొనుగోళ్లు ఆలస్యంగా ప్రారంభించాల్సి వచ్చింది. ఈ ప్రక్రియ ఆలస్యంగా ప్రారంభమైతే వివరాల నమోదులో ఖచ్చితత్వం ఉండకపోవడం వంటివి జరగవచ్చు. దీంతో అసలైన రైతులు తమ పంట ఉత్పత్తులను మద్దతు ధరకు విక్రయించుకునే అవకాశం ఉండకపోవడంతో పాటు దళారులకు మేలు చేకూరనుంది.
పంట సాధారణం ప్రస్తుత సాగు
పత్తి 1,78,963 1,66,447
వరి 1,63.479 35,660
కంది 68,810 61,228
జొన్న 5,245 5,253
పెసర 3,569 2,664
చెరుకు 1,712 1,200
ఆముదం 829 675
మినుములు 235 105
మొక్కజొన్న 165 230
వేరుశనగ 124 20
వానాకాలం పంట వివరా ల నమోదును ప్రభు త్వం డీసీఎస్ పద్ధతిలో చేయా లని ఆదేశాలిచ్చింది. జిల్లా లో ఈ నెల 22న ఈ కార్యక్రమాన్ని ప్రారంభించాం. క్షేత్రస్థాయిలో సందర్శించి సర్వేనెంబర్ల వారీగా పంట వివరాలు నమోదు చేస్తాం. ఎ లాంటి తప్పిదాలకు అవకాశం లేకుండా పక డ్బందీగా చేపట్టేలా చర్యలు తీసుకుంటాం. పంటల నమోదులో ఏ ఒక్క రైతు నష్టపోకుండా సెప్టెంబర్ 30 వరకు సర్వే పూర్తి చేయాలని ఏఓలు, ఏఈఓలకు ఆదేశాలిచ్చాం.
– సక్రియానాయక్,
జిల్లా వ్యవసాయశాఖ అధికారి
ఎల్‌నినోతోనే జాప్యమంటున్న అధికారులు
గతేడాది కూడా ఇదే పరిస్థితి
దళారులకు విక్రయించి
నష్టపోతున్న రైతులు
సకాలంలో పూర్తి చేస్తామంటున్న అధికారులు


