ప్రవక్త చూపిన మార్గం ఆచరణీయం | - | Sakshi
Sakshi News home page

ప్రవక్త చూపిన మార్గం ఆచరణీయం

Aug 27 2026 1:24 AM | Updated on Aug 27 2026 1:24 AM

ర్యాలీలో పాల్గొన్న ముస్లింలు

నారాయణపేట: ప్రవక్త చూపిన మార్గం ఆచరణీయమని.. హిందూ, ముస్లింలు భిన్నత్వంలో ఏకత్వాన్ని చాటుతూ పరస్పర సహకారంతో పండుగలు జరుపుకోవడం అభినందనీయమని ఎస్పీ డా. వినీత్‌ అన్నారు. మిలాద్‌ ఉన్‌ నబీని పురస్కరించుకొని బుధవారం జిల్లాకేంద్రంలో ముస్లింలు భారీ ర్యాలీ నిర్వహించారు. మెయిన్‌చౌక్‌ వద్ద ఎస్పీ పాల్గొని ముస్లిం సోదరులకు పండుగ శుభాకాంక్షలు తెలిపి మాట్లాడారు. మతసామరస్యానికి జిల్లా ప్రతీకగా నిలుస్తోందన్నారు. ప్రతి ఒక్కరూ పరస్పరం గౌరవించుకుంటూ ఐక్యత, స్నేహభావంతో జీవించాలని సూచించారు. పండుగలు ప్రజల మధ్య ప్రేమ, సోదరభావాన్ని మరింత బలోపేతం చేసేలా ఉండాలని ఆకాంక్షించారు.

ఫ కట్టుదిట్టమైన బందోబస్తు..

ర్యాలీలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా పోలీస్‌శాఖ ఆధ్వర్యంలో కట్టుదిట్టమైన భద్రత కల్పించారు. ర్యాలీ మార్గంలోని ముఖ్య కూడళ్లు, సున్నిత ప్రాంతాల్లో ప్రత్యేక బందోబస్తు ఏర్పాటు చేశారు. పోలీసులు ర్యాలీని నిరంతరం పర్యవేక్షిస్తూ శాంతియుతంగా కొనసాగేందుకు చర్యలు చేపట్టారు. శాంతిభద్రతలకు ఎలాంటి విఘాతం కలగకుండా ప్రతి ఒక్కరూ పోలీసులకు సహకరించాలని కోరారు. ప్రజల సహకారంతోనే పండుగలను ప్రశాంతంగా నిర్వహించగలుగుతామని పేర్కొన్నారు. ఆయన వెంట

అదనపు ఎస్పీ ఎండీ రియాజ్‌ ఉల్‌హక్‌, డీసీఆర్బీ డీఎస్పీ మహేష్‌, సీఐలు శివశంకర్‌, రవిబాబు, ఎస్సైలు వెంకటేశ్వర్లు, నరేష్‌, శిరీష, కృష్ణచైతన్య, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement