మక్తల్: గ్రామాలను అన్నివిధాలుగా అభివృద్ధి చేసేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం కృషి చేస్తోందని రాష్ట్ర పశుసంవర్ధకశాఖ మంత్రి వాకిటి శ్రీహరి అన్నారు. బుధవారం నియోజకవర్గ కేంద్రంలోని తన క్యాంపు కార్యాలయంలో మాగనూర్, కృష్ణా మండలాల ముఖ్య నాయకులతో ఆయన సమావేశమయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. నియోజకవర్గంలో రూ.1,600 కోట్ల అభివృద్ధి పనులు కొనసాగుతున్నాయన్నారు. గ్రామాల్లో ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా సమస్యలను పరిష్కరించేందుకు కృషి చేయాలని కోరారు. ఏమైనా ఇబ్బందులు ఉంటే తన దృష్టికి తీసుకురావాలని సూచించారు. కార్యక్రమంలో పుర చైర్‌పర్సన్ వాకిటి మానస, జెడ్పీటీసీ మాజీ సభ్యుడు లక్ష్మారెడ్డి, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ గణేష్‌కుమార్, నాయకులు కోళ్ల వెంకటేష్, రవికుమార్, శివరాంరెడ్డి, ఆనంద్‌గౌడ్, శ్రీనివాస్‌రెడ్డి, శ్రీనివాస్‌గౌడ్ తదితరులు పాల్గొన్నారు.
మంత్రికి స్వల్ప అస్వస్థత..
కార్యకర్తలతో మాట్లాడుతున్న సమయంలో మంత్రి వాకిటి శ్రీహరి స్వల్ప అస్వస్థతకు గురయ్యారు. కళ్లు తిరుగుతున్నట్లు అవుతుందని సన్నిహితులకు చెప్పడంతో వెంటనే స్థానిక వైద్యుడిని ఇంటికి పిలిపించి తాత్కాలిక చికిత్స అందించారు. అనంతరం హైదరాబాద్‌కు వెళ్లి అక్కడ చికిత్స తీసుకుంటున్నారు.
ఇందిరమ్మ ఇంటిని ప్రారంభించిన మంత్రి..
మక్తల్ మండలం గొల్లపల్లిలో బుధవారం మంత్రి వాకిటి శ్రీహరి ఇందిరమ్మ ఇంటి ప్రారంభోత్సవంలో పాల్గొన్నారు. లబ్ధిదారు పొర్ల నరేష్ దంపతులకు కొత్త దుస్తులు అందించి శుభాకాంక్షలు తెలిపారు. మంత్రి వెంట మార్కెట్ వైస్ చైర్మన్ గణేష్‌కుమార్, సర్పంచ్ సూర్యకుమార్, మాజీ ఉపసర్పంచ్ కట్ట సురేష్, వాకిటి హన్మంతు, వాకిటి శ్యామ్, నాగేష్ తదితరులు పాల్గొన్నారు.


