మక్తల్: మా నాన్న ఆశయాల సాధనకు నిరంతరం కృషి చేస్తామని మహబూబ్‌నగర్ ఎంపీ డీకే అరుణ, మక్తల్ మాజీ ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్‌రెడ్డి అన్నారు. బుధవారం పట్టణంలో నిర్వహించిన చిట్టెం నర్సిరెడ్డి జయంతి వేడుకల్లో వారు పాల్గొని మినీ ట్యాంకుబండ్‌పై ఉన్న ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి మాట్లాడారు. నియోజకవర్గంలోని సంగంబండ, భూత్పూర్, భీమా ప్రాజెక్టులను సాధించి రైతులకు సాగు, తాగునీరు అందించిన ఘనత నర్సిరెడ్డిదేనన్నారు. రాజకీయాల్లో క్రమశిక్షణకు మారుపేరుగా నిలిచిన నాయకుడని.. తుది శ్యాస వరకు ప్రజాసేవకే అంకితమయ్యారని గుర్తు చేశారు. ఈ ప్రాంతంలో ప్రాజెక్టుల నిర్మాణం కోసం ఉద్యమాలు చేసిన ఘనత ఆయనదేనని.. చిట్టెం కుటుంబం ప్రజల సంక్షేమానికి నిరంతరం కృషి చేస్తోందని తెలిపారు. కార్యక్రమంలో చిట్టెం సుచరిత, చిట్టెం చాణక్యరెడ్డి, మాజీ ఎంపీపీ వెంకట్రామారెడ్డి, రతంగ్‌పాండురెడ్డి, మహిపాల్‌రెడ్డి, మహేశ్వర్‌రెడ్డి, సుధాకర్‌రెడ్డి, సుదర్శన్‌రెడ్డి, శివారెడ్డి, చిన్నహన్మంతు, సాగర్ తదితరులు పాల్గొన్నారు.


