న్యూస్‌రీల్
నారాయణపేట
మంగళవారం శ్రీ 25 శ్రీ ఆగస్టు శ్రీ 2026
మరికల్: కేంద్రం ప్రభుత్వం తీసుకొచ్చిన ఫ్రేమ్ వ ర్క్ ఫర్ ఫర్టిలైజర్ సేల్ యాప్ (ఎఫ్‌ఎఫ్‌ఎస్) అన్నదాతలకు చుక్కలు చూపిస్తోంది. గతంలో రాష్ట్ర ప్రభు త్వం తెచ్చిన ఫర్టిలైజర్ యాప్‌కు రైతులు ఇప్పుడిప్పు డే అలవాటుపడుతుండగా.. మళ్లీ కొత్త యాప్ తేవడంతో ఏ యాప్‌లో యూరియా బుకింగ్ చేసు కోవాలో తెలియక తికమక పడు తున్నారు. అధికారులు ఎఫ్‌ఎఫ్‌ఎల్‌పై క్షేత్రస్థాయిలో అవగాహన కల్పించకపోవడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు.
అందని ఎరువులు
కేంద్ర ప్రభుత్వం ఈ నెల 6 నుంచి తీసుకొచ్చిన ఫ్రేమ్ వర్క్ ఫర్ ఫర్టిలైజర్ సేల్ యాప్‌తో ఇబ్బందులు ఎదురవుతున్నాయి. గంటల తరబడి ఫోన్‌లో యాప్‌కు సంబంధి ంచిన సిగ్నల్ లేకపోవడంతో రైతులు విసిగిపోతున్నారు. దుకాణానికి యూరి యా వచ్చిందని యాప్‌లో చూపించగానే రైతులు బుకింగ్ చేసుకొని, ఫర్టిలైజర్ దుకాణాల వద్దకు వెళ్లి బారులు తీరుతున్నారు.కానీ యూరియా మాత్రం చేతికి రా వడం లేదు. అప్పటికే స్టాక్ అయిపోయిందని నిర్వాహకులు చెబుతున్నారు.డీలర్లకు తక్కువ మొత్తమే వచ్చినా, యూప్‌లో మాత్రం ఎక్కువగా చూపిస్తోందని షాపు యజమానులు చెబుతుండడంతో విసిగిపోయిన రైతులు ఆందోళనకు దిగుతున్నారు.
యూరియా కోసం ఇబ్బందులు పడుతున్న రైతులు
పనిచేయని ఫర్టిలైజర్ బుకింగ్ యాప్
ఫ్రేమ్ వర్క్ ఫర్ ఫర్టిలైజర్ సేల్
యాప్‌తో తంటాలు
వేధిస్తున్న సర్వర్ సమస్య
ఆందోళనలో అన్నదాత


