నారాయణపేట: జిల్లాలో దీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న కేసుల దర్యాప్తును వేగవంతం చేయా లని ఎస్పీ డాక్టర్ వినీత్ పోలీసు అధికారులను ఆదేశించారు. సోమవారం ఎస్పీ కార్యాల యంలోని కాన్ఫరెన్స్ హాల్‌లో పోలీసు అధికారులతో నిర్వహించిన సమావేశంలో మిలాద్ ఉన్ నబి బందోబస్తు ఏర్పాట్లు, పోలీస్ సంఘం ఎన్నికలు, దీర్ఘకాలిక పెండింగ్ కేసులు, దొంగతనం కేసులపై ఎస్పీ సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మా ట్లాడుతూ బుధవారం నిర్వహించనున్న మిలాద్ ఉన్ నబి పండుగ సందర్భంగా ముందస్తు బందోబస్తు చర్యలు చేపట్టాలని ఎస్పీ సూచించారు. అవసరమైన ప్రాంతాల్లో డ్రోన్ కెమెరాలు, వీడియోగ్రఫీ ద్వారా ర్యాలీలను రికార్డు చేయాలని, ప్రధాన చౌరస్తాల వద్ద పోలీస్ పికెట్లు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. జిల్లా పరిధిలో మంగళవారం నిర్వ హించనున్న పోలీస్ సంఘం ఎన్నికలను ఎలాంటి అవకతవకలకు తావులేకుండా పూర్తి పారదర్శకంగా నిర్వహించాలన్నారు. నోడ ల్ అధికారి డీసీఆర్‌బీడీఎస్పీ మహేష్, అదనపు ఎస్పీ ఎండీ రియాజ్ ఉల్‌హక్, సీఐలకు ఎన్నికల నిర్వహణపై ప్రత్యేక సూచనలు చేశారు.
ప్రత్యేక సమీక్ష
డీజీపీ వార్షిక క్రైం రివ్యూ సమావేశానికి తమ పరిధిలో నమోదైన నేరాలు, కేసుల దర్యాప్తు, పురోగతి, పెండింగ్ కేసులు తదితర అంశాలపై సమగ్ర సమాచారాన్ని సిద్ధం చేసుకోవాలని సూచించారు. జిల్లాలో దీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న కేసులపై ప్రత్యేక దృష్టి సారించి దర్యాప్తును వేగవంతం చేయాలని ఆదేశించారు. ముఖ్యంగా ప్రాపర్టీ దొంగతనం కేసుల్లో నిందితులను గుర్తించి, చోరీకి గురైన ఆస్తులను రికవరీ చేసేందుకు కృషి చేయాలన్నారు. సమావేశంలో అదనపు ఎస్పీ ఎండీ రియాజ్ ఉల్ హక్, డీఎస్పీ మహేష్, సీఐలు శివశంకర్, రామ్‌లాల్, భగవంత్‌రెడ్డి, సైదులు, ఎస్‌ఐలు వెంకటేశ్వర్లు, సతీష్‌రెడ్డి, నరేష్, విజయ్‌కుమార్, రాజు, రమేష్, ఎస్‌ఎం నవీద్, అశోక్ బాబు, గాయత్రి, రేవతి తదితరులు పాల్గొన్నారు.


